ఎపిసోడ్ ప్రారంభంలో మావయ్య గారిని పెళ్లికి తీసుకురావాల్సింది సంతోషించేవారు కదా నీదే తప్పు అంటుంది దివ్య. మొదటిసారి ఒక గొంతుక నా తరఫున మాట్లాడుతుంది అనుకుంటాడు ప్రకాశం. పక్షవాతం వచ్చిన దగ్గరనుంచి నాన్న ఇదే గదిలో ఉండిపోయారు అంటాడు, నేను చెప్పినా వినరు అంటాడు విక్రమ్. నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను వినలేదు అందుకని వదిలేసావా గట్టిగా ప్రయత్నించి నన్ను సాధించుకున్నావు అలాంటప్పుడు మావయ్య గారిని మాత్రం ఎందుకు వదిలేసావు.