ఆ గొంతు విన్న అను, ఆర్య సార్ అనుకుంటూ స్టేషన్ లోపలికి వస్తుంది. కానిస్టేబుల్స్ తో ఆమెని బయటికి నెట్టేయబోతుంటే అప్పుడే అక్కడికి పై ఆఫీసర్ అక్కడికి వస్తారు. అను ద్వారా జరిగింది తెలుసుకొని రెండు నిమిషాలు మాట్లాడితే ఏంటి నీ ప్రాబ్లం అని ఎస్ఐ ని మందలించి అనుని లోపలికి పంపిస్తాడు. అను, ఆర్యతో మాట్లాడి మిమ్మల్ని ఇలా చూడటం నాకు బాధగా ఉంది అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.ఎందుకు ఇంత పట్టు పడుతున్నావు వెళ్ళిపోవచ్చు కదా మన బేబీ కోసమైనా ఆలోచించాలి కదా అంటాడు ఆర్య. మీరు నా దేవుడు మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండగలను అంటుంది అను. తర్వాత ఏం జరిగిందో రేపు ఎపిసోడులో చూద్దాం.