నీ కొడుకులకు వంట నేర్పు భార్యలకు వండి పెడతారు... నెటిజన్ కామెంట్ కి అనసూయ కౌంటర్ ఏంటంటే?

Published : Apr 20, 2023, 07:30 AM ISTUpdated : Apr 20, 2023, 07:41 AM IST

యాంకర్ అనసూయ కామెంట్స్ కి ఓ నెటిజెన్ కౌంటర్ ఇచ్చాడు. మీ అబ్బాయిలకు వంట నేర్పు అంటూ ఎద్దేవా చేశాడు. సదరు కామెంట్స్ పై అనసూయ రియాక్ట్ అయ్యారు.   

PREV
15
నీ కొడుకులకు వంట నేర్పు భార్యలకు వండి పెడతారు... నెటిజన్ కామెంట్ కి అనసూయ కౌంటర్ ఏంటంటే?
Anasuya Bharadwaj

ఫైర్ బ్రాండ్ అనసూయ గురించి తెలిసిందే. ఈ మాజీ యాంకర్ సోషల్ మీడియా ట్రోల్స్ ని అసలు సహించరు. వెంటనే కౌంటర్స్ ఇచ్చేస్తారు. తాజాగా ఆమె వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించిన ఓ నెటిజన్ కి అనసూయ ఇచ్చి పడేసింది. సిటాడెల్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియాంక చోప్రా స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడారు. ఈ రోజుల్లో కూడా మహిళలు ఉద్యోగం చేయడాన్ని కొందరు తట్టుకోలేకపోతున్నారు. మా కుటుంబంలో నన్ను ప్రోత్సహిస్తారు. నా భర్త నిక్ మద్దతు ఇస్తారని... ఆమె చెప్పారు.

25

ప్రియాంక వీడియో షేర్ చేసిన అనసూయ ఆమెను సమర్థిస్తూ కామెంట్స్ చేశారు. అవును కుటుంబ సభ్యులు అందరూ ఒక జట్టుగా పని చేయాలి. ఒకరినొకరు గౌరవించుకుంటూ, అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. చాలా కుటుంబాల్లో ఇది కనిపించడం లేదు. దీన్ని కొందరు ట్రోల్ చేస్తుంటారు. ఆడామగా కలిసి పని చేసినప్పుడే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది... అని అనసూయ అన్నారు. 
 

35
Anasuya Bharadwaj

అనసూయ కామెంట్స్ పై ఓ నెటిజెన్ వ్యంగంగా స్పందించారు. నీ పిల్లలకు వంట నేర్పు. ఉద్యోగం చేసే భార్యల కోసం ఇంటి పనులు చక్కబెడతారు... అని అన్నాడు. దీనిపై స్పందించిన అనసూయ... నా 11 ఏళ్ల కొడుకు ఆల్రెడీ వంట చేస్తున్నాడు. నాకు కిచెన్ లో సహాయం చేస్తుంటాడు. ఇంటి పనులే కాదు కుటుంబాన్ని ఎలా పోషించాలో కూడా నా కొడుకులకు నేర్పిస్తాను. 
 

45

నా కొడుకు అతని భార్య ఎలా జీవించాలో మనం నిర్ణయించలేము. వాళ్ళ అభిరుచిని బట్టి వారు జీవిస్తారు. సమాజంతో వచ్చిన సమస్య ఇదే. నువ్వు నీ పని చూసుకో... ఘాటుగా స్పందించింది. అనసూయ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

55

అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనపై వచ్చే ట్రోల్స్ కి రియాక్ట్ అవుతుంటారు. హద్దులు దాటి ట్రోల్ చేస్తే అసలు సహించరు. పలువురి మీద సైబర్ క్రైమ్ విభాగంలో అనసూయ ఫిర్యాదు చేశారు. ఇక యాంకరింగ్ మానేసిన అనసూయ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే... 
 

Read more Photos on
click me!

Recommended Stories