బిగ్ బాస్ 5 నుంచి ప్రియా అవుట్.. ఇద్దరూ ఎలిమినేట్ అనుకున్నారు, కానీ..

First Published | Oct 24, 2021, 10:39 PM IST

Bigg Boss 5 Telugu ఆదివారం ఎపిసోడ్ ఊహించని ట్విస్టులతో సాగింది. సరదాగా సాగుతూనే ట్విస్టులతో ఆకట్టుకుంది. నాగార్జున బాగా టెన్షన్ పెట్టారు. సండే ఫన్ డే కాబట్టి నాగార్జున రాగానే నాకౌట్ గేమ్స్ మొదలు పెట్టారు.

Bigg Boss 5 Telugu ఆదివారం ఎపిసోడ్ ఊహించని ట్విస్టులతో సాగింది. సరదాగా సాగుతూనే ట్విస్టులతో ఆకట్టుకుంది. నాగార్జున బాగా టెన్షన్ పెట్టారు. సండే ఫన్ డే కాబట్టి నాగార్జున రాగానే నాకౌట్ గేమ్స్ మొదలు పెట్టారు. పిల్లోస్ తో మొదలు పెట్టిన గేమ్.. మ్యూజికల్ చైర్స్, టోపీ గేమ్ వరకు సాగింది. ఒక్కో గేమ్ లో కొంతమంది నాకౌట్ అవుతూ ఉంటారు. ఒక రౌండ్ పూర్తిగా సినిమాలకు రిలేటెడ్ సాగింది. 

ఇంద్ర చిత్రంలో చిరంజీవి రెండు పేర్లు ఏంటి అని నాగార్జున గేమ్ లో ఉన్న వారిని అడిగారు. తప్పు ఆన్సర్ ఇచ్చిన వారు నాకౌట్ అవుతారు. చాలా మంది తొలి పేరు ఇంద్ర సేనారెడ్డి అని చెప్పారు కానీ.. రెండవ పేరు శంకర్ నారాయణ చెప్పలేకపోయారు. అలా చివరకు విశ్వ, అనీ మాస్టర్ ఫైనల్స్ కి చేరుతారు. 


వీరిద్దరికి నాగ్ ఫైనల్ గేమ్ టోపీలతో పెడతారు. ఇద్దరూ టోపీ ధరించాలి. నాకౌట్ అయిన మిగిలిన సభ్యులు తమకు ఇష్టమైన వారిని ఎంచుకోవచ్చు. అలా కొంతమంది అనీ వైపు, అనీ వైపు ఉన్నవారు విశ్వ టోపీ కింద పడేయడానికి.. విశ్వ వైపు ఉన్నవారు అనీ టోపీ పడేయడానికి ప్రయత్నించాలి. ఈ గేమ్ లో అనీ విజయం సాధిస్తుంది. దీనితో ఆమెకు బిగ్ బాస్ నుంచి ఓ పవర్ లభిస్తుంది. 

ఇక నామినేషన్స్ లో ఉన్న వారు సేవ్ అయ్యే ప్రక్రియ చాలా ఆసక్తిగా సాగుతుంది. నామినేషన్స్ లో ఉన్నవారు గార్డెన్ లో ఉన్న కోడి బొమ్మ వద్దకు వెళ్లి నిలబడాలి. ఎవరికి ఇతర జంతువుల సౌండ్ కాకుండా కోడి సౌండ్ వస్తుందో వారు మాత్రమే సేఫ్. ఈ రౌండ్ లో లోబో సేఫ్ గా బయట పడతాడు. ఆ తర్వాత ఫ్రూట్స్ బొమ్మలతో నామినేషన్స్ లో ఉన్నవారికి షీట్స్ ఇస్తారు. అన్నీ ఒకే ఫ్రూట్ తో ఉండే షీట్స్ వచ్చిన వారు సేఫ్. సిరి మాత్రమే అన్నీ అరటి పండ్లు వస్తాయి. దీనితో సిరి సేఫ్ అవుతుంది. 

చివరగా నామినేషన్స్ లో అనీ మాస్టర్, ప్రియా, జెస్సి ఉంటారు. వీరు ముగ్గురుకి మూడు బెలూన్స్ ఇస్తారు. కెప్టెన్ సన్నీ ఆ బెలూన్స్ ని పగలగొడతారు. బెలూన్స్ లోపల సేఫ్ అనే చీటీ వచ్చిన వారు సేఫ్. అలా జెస్సి సేఫ్ అవుతారు. ఫైనల్ గా అనీ, ప్రియా నామినేషన్స్ లో ఉంటారు. ఇక్కడే నాగార్జున ఊహించని ట్విస్ట్ ఇస్తారు. ఇద్దరూ ఇంటి సభ్యులకు బై చెప్పేసి బయటకు వచ్చేయండి.. ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలిశాక బై చెప్పే ఛాన్స్ కూడా రాదు అని టెన్షన్ పెడతారు. దీనితో అనీ, ప్రియా ఇద్దరూ ఇంటి సభ్యులు బై చెప్పి బయటకు వస్తారు. 

అక్కడ చిన్న రూమ్స్ లోకి ఎంటర్ అవుతారు. మిగిలిన హౌస్ మేట్స్ మొత్తం లివింగ్ రూమ్ లోనే ఉంటారు. ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూడమని నాగార్జున ఇంటి సభ్యులకు చెబుతారు. దీనితో ఉత్కంఠగా హౌస్ మేట్స్ అంతా ఆ చిన్న రూమ్స్ వైపు పరుగులు తీస్తారు. రూమ్స్ ఓపెన్ చేయగా ఇద్దరూ కనిపించరు. దీనితో హౌస్ మేట్స్ కంగారు పడతారు. వెయిట్ చేయండి బహుశా ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారేమో అని ఇంకా టెన్షన్ పెంచుతారు. కానీ చివరకు ప్రియా ఎలిమినేటి అవుతుంది. అనీ మాస్టర్ సేఫ్ గా హౌస్ లోకి తిరిగి వస్తుంది. ప్రియా స్టేజిపైకి వెళ్లి ఒక్కో ఇంటి సభ్యుడి గురించి సరదాగా మాట్లాడుతుంది. ఒక్కొక్కరికి మార్కులు ఇస్తుంది. అనంతరం నాగార్జున ప్రియాని బయటకు పంపుతారు. అంతటితో సండే ఎపిసోడ్ ముగుస్తుంది. 

Latest Videos

click me!