మోనితను బిడ్డతో సహా ఇంట్లో తెచ్చి పెట్టుకోనున్న డాక్టర్ బాబు.. ఛీ ఇదొక సీరియలా అంటూ?

First Published | Oct 24, 2021, 8:22 PM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఈ సీరియల్ ఒకటే కథ పై ప్రసారం కాగా ఎన్నో ట్విస్టులతోనే (Twist) సాగుతుంది. 

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఈ సీరియల్ ఒకటే కథ పై ప్రసారం కాగా ఎన్నో ట్విస్టులతోనే (Twist) సాగుతుంది. ఇక ఈ సీరియల్ ని చూసే ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ కు శుభం కార్డు లేదని అంటున్నారు.
 

వంటలక్క, డాక్టర్ బాబు (Vantalakka, Doctor Babu) ఎన్నో ఏళ్ళు దూరంఉండి మంచిగా కలుసుకున్న సమయంలో మోనిత (Monitha) వచ్చి వాళ్ళ కాపురంలో పెద్ద బాంబు వేసింది. అంతే ఆరోజు నుంచి ఇప్పటివరకు మోనిత.. డాక్టర్ బాబును అస్సలు వదలడం లేదు.
 


మోనిత కార్తీక్ ను ప్రేమించడంతో అతడిని పెళ్లి చేసుకోవడానికి పైశాచికంగా బాగా హింసిస్తుంది. కార్తీక్ ఎంతకు ఒప్పుకోకపోవడంతో చివరికి కార్తీక్ (Karthik) శాంపిల్స్ ద్వారా ఆర్టిఫిషియల్ గర్భాన్ని దాల్చింది. ఇక ఈ గర్భంతో అసలు ట్విస్ట్ ఇచ్చింది మోనిత (Monitha).
 

పాపం ఇక కార్తీక్ జీవితంలో సంతోషం అనేది లేకుండా పోయింది. ఓవైపు దీపకు (Deepa) ఎలా న్యాయం చేయాలో అని మరోవైపు మోనితను (Monitha) ఎలా వదులుకోవాలి అని ఎంత ప్రయత్నించినా కూడా ఆ ముడి మాత్రం వదలడం తన వల్ల కావట్లేదు.
 

చివరికి కార్తీక్ (Karthik) కోసం జైలుకు కూడా వెళ్లి అందులో ఉండి కూడా కార్తీక్ ను కార్తీక్ కుటుంబాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఇక కార్తీక్ ఇవన్నీ తట్టుకోలేక తన కుటుంబంతో అమెరికాకు వెళ్లాలనుకున్నాడు. కానీ జైలు నుండి విడుదలైన మోనిత (Monitha) కార్తీక్ ప్రయాణాన్ని ఆపివేసింది.
 

కార్తీక్ ఏమీ చేయలేక భయపడి ఇంట్లోనే ఉండిపోయాడు. ఇక మోనిత (Monitha) మొత్తానికి ఓ బిడ్డను కూడా కన్నడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ బిడ్డతో మోనితను తీసుకొని కార్తీక్ (Karthik)  తన ఇంటికి తీసుకువస్తాడన్న ఆలోచనలు వస్తున్నాయి.
 

ఎందుకంటే మోనిత (Monitha) బెదిరిస్తే కార్తీక్ (Karthik) లొంగి పోవాల్సిందే. ఒకవేళ ఇంటికి తీసుకెళ్లమని కోరితే మాత్రం కార్తీక్.. మోనిత భయంతో తనను తన బిడ్డతో సహా ఇంటికి తీసుకువెళ్లడం గ్యారెంటీ అనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సీరియల్ ఇలా సాగుతుండటంతో ఛీ కొడుతున్నారు ప్రేక్షకులు.
 

మరి కార్తీక్ మోనితను (Monitha) బిడ్డతో సహా ఇంట్లోకి తీసుకొస్తే ప్రేక్షకులను ఈసారి డైరెక్టర్ పైకే అటాక్ చేయడానికి వస్తారేమో. ఇక మోనిత బిడ్డని కన్నాక మారుతుందో లేదా కార్తీక్ (Karthik) ఇంట్లో తిష్ట వేస్తుందో చూడాలి.

Latest Videos

click me!