Intinti Gruhalakshmi: సొంత ఇంటిని తులసికి కానుకగా ఇచ్చిన పరంధామయ్య.. ఆనందంతో సంబరపడిపోతున్న తులసి!

Published : Oct 20, 2022, 10:10 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 20వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
19
Intinti Gruhalakshmi: సొంత ఇంటిని తులసికి కానుకగా ఇచ్చిన పరంధామయ్య.. ఆనందంతో సంబరపడిపోతున్న తులసి!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..ఆ గిఫ్ట్ లో ఏమున్నది మావయ్య నా దగ్గర ఎందుకు పెట్టారు అని అడగగా, నీకే తెలుస్తుంది అమ్మ కొద్దిసేపు ఆగు అని అంటాడు పరంధామయ్య. దానికి దివ్య, చేతిలోనే ఉన్నది కదా మామ్ గిఫ్ట్ ఓపెన్ చేసి చూడు అని అనగా పరంధామయ్య వద్దు ఆగండి మిమ్మల్ని ఒక చోటుకు తీసుకొని వెళ్ళాలి అక్కడే గిఫ్ట్ తెరండి అని అనగా, అనసూయ ఎక్కిరిస్తూ మహా అయితే రోల్డ్ గోల్డ్ చేవిలీలు ఉంటాయి అంతకుమించి కొనే సీన్ మీ మామగారికి లేదమ్మా ఈ మాత్రం దానికి ఎక్కడికొ తీసుకెళ్ళి గిఫ్ట్ ఓపెన్ చేపిస్తాను అనడం ఎందుకు అని అంటుంది.
 

29

 ఈ ఒక్కసారి నా మాట వినండి, రండి.ఎక్కడికి అని ఏమి అడగద్దు నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రండి అక్కడికి గిఫ్ట్ ఓపెన్ చేపిస్తాను అని అంటాడు. అప్పుడు అభి, ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి నేను క్యాబ్ బుక్ చేస్తాను అని అనగా మీ పప్పులు నా దగ్గర ఉడకవు ఎక్కడికి వెళ్లాలో నేను చెప్పను నేను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసేసాను అని అందర్నీ క్యాబ్లో వాళ్ల పాత ఇంటికి తీసుకొని వెళ్తాడు పరంధామయ్య.ఆ ఇంటిని చూసిన తులసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు మావయ్య అని తులసి అడగగా, ఇంకేం ఉన్నది మామ్.
 

39

 ఇక్కడ హోమ్ టూర్ ప్లాన్ చేసినట్టున్నారు యూట్యూబ్ లో పెట్టడానికి అని అనగా, పక్క వాళ్ళ ఇంట్లో వీడియోలు తీయడమేంటి అని అనసూయ అంటుంది. అప్పుడు తులసి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మావయ్య నాకు ఇంటి ని చూస్తే బాధగా ఉన్నది పాపం నేను నా చేతులారా ఇంటిని కోల్పోయాను. నా జ్ఞాపకాలు నా గతమంతా ఈ ఇంటి తోనే ముడిపడి ఉన్నది ఇంటిని చూసిన వెంటనే నాకు గతం గుర్తొచ్చి బాధ వస్తుంది. నా జీవితంలో రెండు బాధలు ఉన్నాయి ఒకటి నా విడాకులది ఇంకొకటి ఇంటిని వదులుకున్నాను అని బాధ మాత్రమే.
 

49

 దయచేసి వెళ్ళిపోదాము అని అనగా పరంధామయ్య, ఒక రెండు నిమిషాలు ఆగమ్మా ఇప్పుడా గిఫ్ట్ తెరువు అని అంటాడు. అప్పుడు తులసి ఆ గిఫ్ట్ ని తెరుస్తుంది అందులో ఏవో పేపర్ లు ఉంటాయి. తులసికి అర్థం కాదు అప్పుడు ప్రేమ్ పేపర్ తీసుకొని చదివి ఇది తాతయ్య అసలైన గిఫ్ట్ అంటే.ఈ ఇంటిని అమ్మ పేరు మీద రాయించేశారు అని అనగా,అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆనందంగా ముఖాలు పెడతారు. అప్పుడు తులసి, నా పేరు మీద ఎందుకు మావయ్య అసలు ఇల్లు కొనడం ఎందుకు అని అడుగుతుంది.
 

59

 నువ్వు ఇంటిని వదిలి వెళ్తున్నప్పుడు నీ కళ్ళల్లో చాలా బాధలు చూసాను అమ్మ ఆ బాధను నేను తట్టుకోలేకపోయాను నీ మావయ్యగానే ఏదైనా చేయాలి కదా అందుకే ఇలా చేశాను అని అంటాడు. అప్పుడు తులసి, వద్దు మావయ్య ఇది నా పేరు మీద వద్దు నా జీవితంలో ఎప్పుడూ అన్ని కోల్పోవడమే తప్ప ఎప్పుడూ తిరిగి ఏమీ రాలేదు. ఇలా తిరిగి కూడా వచ్చే రాత దేవుడు నా జీవితంలో రాశాడు అని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఈ ఇంటిని మీ పేరు మీదే ఉంచుకోండి మావయ్య నా పేరు మీద రాస్తే మళ్ళీ దురదృష్టం తో ఇంటిని కోల్పోతానేమో.
 

69

 మీ పేరు మీద ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది అని అనగా, ఇప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను నీతో జన్మలో మాట్లాడను నేను నీకు ఈ ఇంటిని  ప్రేమతో, అభిమానంతో  నీకు ఇస్తున్నాను. నువ్వు ఇంకేం మాట్లాడద్దు అని అనగా సరే మావయ్య అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులెండి అని తులసి అంటుంది. అప్పుడు అనసూయ, ఈ ఇల్లు కొనడానికి మీకు డబ్బులు ఎలా వచ్చాయి అని అనగా తులసి, అవును ఇల్లు కొన్నారని ఆనందం తో ఈ ప్రశ్న అడగడం మర్చిపోయాను ఇన్ని డబ్బులు మీకు ఎక్కడివి అని అడుగుతుంది. 
 

79

దానికి పరంధామయ్య, నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ఎందుకు ఇది చిన్న సీక్రెట్ ముందు మీరు ఇంటికి లోపలికి వెళ్ళండి అని అనగా, ఎందుకంత దాయడం అని అనసూయ అడుగుతుంది. దానికి పరంధామయ్య, వద్దు అన్నమాట పదేపదే మాట్లాడడం నీకు అలవాటు కదా తర్వాత చెప్తాను ముందు ఈ శుభకార్యాన్ని కానివ్వండి అని చెప్పి  ఈ బోర్డ్ ని ఇంటి ముందు తగిలించు అని అంటాడు. ఇంటి బయట తులసి నిలయం అని ఉంటుంది. నా పేరు మీద ఎందుకు మావయ్య ఆనందం పోతుంది ఆనంద నిలయం అని పెట్టుకుందాము అని తులసి అంటుంది.
 

89

  నీ పేరు ఎక్కడుంటే అక్కడే ఆనందం అమ్మ ఏం మాట్లాడకుండా పెట్టు అని పరంధామయ్య అంటాడు. అప్పుడు అందరూ ఆనందంతో ఆ బోర్డ్ నీ అక్కడ పెడతారు. మిగిలిన వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. ఇంటి తలుపు తెరిచి లోపలికి వెళ్దాం అనేసరికి పిల్లలు అందరూ తులసిని ఆపి లోపలికి వెళ్లి పువ్వులు తెచ్చి తులసి లోపలికి అడుగుపెడుతున్నప్పుడు తులసి పైన పువ్వుల వర్షం కురిపిస్తారు. దానికి తులసి ఎంతో ఆనందపడుతుంది. ఇంట్లో వంటగదిని, హాల్ ని, దేవుడి గదిని చూస్తున్న తులసికి తన గతంలో జ్ఞాపకాలు గుర్తొచ్చి ఎంతో ఆనంద పడుతూ ఉంటుంది.
 

99

 ఇల్లును చూసి,మావయ్య ఈ ఇంటిని చూసిన వెంటనే నా గతం అంతా నా కళ్ళ ముందే ఉన్నట్టున్నది చాలా ఆనందంగా ఉన్నది అని దేవుడికి దీపం పెట్టి అనుకుంటుంది. అప్పుడు పరంధామయ్య ఎంతో ఆనందపడతాడు. అప్పుడు తులసి పరంధామయ్యతో, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా మావయ్య మీరు ఎందుకు ఇల్లును నాకు ఇవ్వాలనుకుంటున్నారు అసలు ఇల్లు కొనాలని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories