19 ఏళ్లకే హీరో, 22 ఏళ్లకు లవర్ బాయ్ ఇమేజ్, ఇప్పుడు సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న సిక్స్ ప్యాక్ హీరో ఎవరో తెలుసా?

Published : Jun 08, 2025, 10:06 AM IST

చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చిన ఓ కుర్రాడు 19 ఏళ్లకే హీరో అయ్యాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో లేడీ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. కాని ఆఇమేజ్ ను నిలబెట్టుకోలేకపోయాడు. యంగ్ హీరో ప్రస్తుతం 32 ఏళ్ళ వయస్సులో సినిమాల్లేక ఇబ్బందిపడుతున్నాడు. ఇంతకీ ఎవరతను? 

PREV
15

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలామంది యంగ్ స్టార్స్ కనిపించకుండా పోయారు. స్టార్ ఇమేజ్ రాకపోవడంతో సినిమాలు మానేసినవారు కొందరయితే, హీరోలుగా ఛాన్స్ లు రాక క్యారెక్టర్ రోల్స్ చేసేవారు మరికొందరు. అలాంటి హీరోలలో ప్రిన్స్ కూడా ఉన్నాడు. కెరీర్ లో సరైన గైడెన్స్ లేక హీరోగా సినిమా ఛాన్స్ లు రాక క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటున్నాడు ఈ సిక్స్ ప్యాక్ హీరో.

25

విశాఖపట్నంలో పుట్టిపెరిగిన ప్రిన్స్ సెసిల్ బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేశాడు. టాలీవుడ్‌లో చాలా చిన్న వయస్సులోనే ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్, కేవలం 19 ఏళ్ల వయసులోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి.. 22 ఏళ్లకే హీరోగా లవర్ బాయ్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా ఫస్ట్ మూవీ బస్ స్టాప్ తోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాడు ప్రిన్స్, లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. 

35

లవ్ అండ్ రొమాంటిక్ జానర్లో సినిమాలు చేస్తూ.. తనదైన శైలితో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ, కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో ప్రిన్స్ కు టైమ్ కలిసిరాలేదు. హీరోగా అవకాశాలు రాకపోవడంతో స్టార్ ర్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ తో పాటు మరికొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు చేశాడు. అంతే కాదు అలాగే బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ లో సందడి చేశాడు. బిగ్ బాస్ కొన్ని అవకాశాలు వచ్చినా, అతని కెరీర్‌కు స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకోలేకపోయాడు.

45

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రిన్స్ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి పలు విషయాలు వెల్లడించాడు. “నేను 19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. 21 ఏళ్లకు హీరో అయ్యాను. కానీ నాకు సరైన గైడెన్స్ ఇచ్చే వారు ఎవరూ లేరు. ఈ విషయంలో అది కూడా నా తప్పే. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఎవరిలోనూ కలిసే వాడిని కాదు. అందుకే పరిచయాలు లేవు. ఫలితంగా నాకు సరైన సలహాలు ఇచ్చేవారు లేకుండాపోయారు. అందుకే హీరోగా నిలదొక్కుకోలేకపోయాను” అని అన్నారు.

55

ప్రస్తుతం కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ గడిపేస్తున్న32 ఏళ్ల ప్రిన్స్ సెసిల్, మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. సిక్స్ ప్యాక్ బాడీ తో కొత్తగా ఏదో ప్రయత్నం కూడా చేస్తున్నాడు. డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రిన్స్. అటు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే ఇటు హీరోగా నిలబడాలని ఆరాటపడుతున్నాడు. మరి అతని కల నెరవేరుతుందా లేదా చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories