OTT Movies: ఓటీటీలో ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న తెలుగు క్రేజీ కామెడీ సినిమా.. ప్రైమ్‌లో టాప్ 10 మూవీస్‌ ఇవే

Published : Mar 28, 2026, 09:47 AM IST

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు టాప్‌ 10లో ట్రెండ్‌ అవుతున్నాయి. అందులో శ్రీవిష్ణు సినిమా మొదటి స్థానంలో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుండటం విశేషం. 

PREV
16
అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా టాప్‌ 10 మూవీస్‌

ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌ ఉంది. అన్ని రకాల జోనర్‌ చిత్రాలున్నాయి. అయితే ఇందులో థియేటర్లో ఆడని సినిమాలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.   తెలుగు సినిమా థియేటర్లలో ఆడలేదు. కానీ ఓటీటీలో మాత్రం ఇండియా వైడ్‌గా నెంబర్‌ 1లో ట్రెండ్‌ అవుతుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌ టాప్‌ 10లో రెండు తెలుగు సినిమాలుండగా, ఇందులో లాక్‌ డౌన్‌ కూడా ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

26
టాప్‌ 1- విష్ణు విన్యాసం

ప్రైమ్‌ వీడియోస్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న తెలుగు సినిమా `విష్ణు విన్యాసం`. శ్రీవిష్ణు, నయన సారిక జంటగా నటించిన చిత్రమిది. శ్రీవిష్ణు మార్క్ క్రేజీ కామెడీగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో ఆడలేదు. గత నెలలోనే ఇది థియేటర్లలో విడుదలయ్యింది. ఈ శుక్రవారం నుంచే ఓటీటీలోకి రాగా, ఇప్పుడు ఇండియా వైడ్‌గా  నెంబర్‌ 1 స్థానంలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

36
టాప్‌-2, 3, 4, 5 మూవీస్‌

దీంతోపాటు ఆస్పిరెంట్‌ అనే వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 3 ఇండియా వైడ్‌గా టాప్‌ 2లో ట్రెండ్‌ అవుతుంది.

అలాగే `రాహు కేతు` అనే హిందీ సినిమా ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతుంది. ఇది మూడో స్థానంలో దూసుకుపోతుంది. దీన్ని ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.

దీంతోపాటు `మెర్సీ` అనే హాలీవుడ్‌ మూవీ టాప్‌ 4లో ట్రెండ్‌ అవుతుంది. ఇది మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ. రేసిగా సాగుతూ ఆకట్టుకుంటోంది.

మరో హాలీవుడ్‌ ఫిల్మ్ `ది హౌజ్‌మెయిడ్‌` కూడా ప్రైమ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇది టాప్‌ 5లో దూసుకుపోతుండటం విశేషం.

46
టాప్‌ 6 - అనిల్‌ కపూర్‌ `సుబేదార్‌`

అనిల్‌ కపూర్‌ నటించిన హిందీ యాక్షన్‌ డ్రామా `సుబేదార్‌` ఇండియా వైడ్ గా టాప్‌ 6లో ట్రెండ్‌ అవుతుంది. సురేష్‌ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధిక మదన్‌, ఖుష్బూ సుందర్‌, సౌరబ్‌ శుక్లా, ఆదిత్య రావల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ టాప్‌ 6లో ట్రెండ్‌ కావడం విశేషం.

56
టాప్‌ 7 - అనుపమా పరమేశ్వరన్‌ `లాక్‌ డౌన్‌`

ఆ తర్వాత అనుపమా పరమేశ్వరన్‌ నటించిన `లాక్‌ డౌన్‌` మూవీ ఇండియా వైడ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది. అనేక అవాంతరాల తర్వాత థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ ప్రైమ్‌లో మాత్రం దుమ్ములేపుతుంది. ఇది టాప్‌ 7లో ట్రెండ్‌ అవుతుంది. ఏఆర్‌ జీవ దర్శకత్వం వహించిన ఈ తమిళ చిత్రంలో అనుపమా ప్రధాన పాత్ర పోషించారు. డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కింది.

66
టాప్‌ 8 - కపుల్‌ ఫ్రెండ్లీ

మరో తెలుగు సినిమా `కపుల్‌ ఫ్రెండ్లీ` ఇండియా వైడ్‌గా టాప్‌ 8లో ట్రెండ్‌ అవుతుంది. సంతోష్‌ శోభన్‌, మానసా వారణాసి జంటగా నటించిన ఈ మూవీకి అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించారు. అజయ్‌ కుమార్‌ రాజు నిర్మించారు. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లో బాగానే ఆడింది. ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ములేపుతుంది. చాలా రోజులుగా టాప్‌ 10లో ట్రెండ్‌ అవుతుంది.

వీటితోపాటు శశికుమార్‌, చైత్ర జే అచర్‌ జంటగా నటించిన `మై లార్డ్` మూవీ టాప్‌ 9లో ట్రెండ్‌ అవుతుండగా, `యంగ్‌ షేర్లాక్‌` అనే హాలీవుడ్‌ చిత్రం టాప్‌ 10లో నిలిచింది. ఇలా ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా టాప్ 10లో రెండు తెలుగు సినిమాలు, రెండు తమిళ చిత్రాలు, రెండు హిందీ చిత్రాలుండగా, 3 హాలీవుడ్‌ మూవీస్‌ ఉండగా, ఒక వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories