కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 28వ తేదీ)లో దీపకు భయం పరిచయం చేస్తానన్న జ్యో. అన్నీ వదిలేసి పెళ్లి చేసుకోమన్న దీప. కార్తీక్, దీపలకు తన ప్లాన్ గురించి చెప్పిన దశరథ. పారు కోసం కార్తీక్ కొత్త ప్లాన్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో ప్రతిసారి నేను నీతో ఓడిపోతూనే ఉన్నాను దీప.. ఒకటి నాకు సొంతం అయ్యే లోపే నువ్వు దక్కించుకుంటున్నావు అంటుంది జ్యోత్స్న. నువ్వు నీ స్వార్థం కోసం గెలవాలి అనుకుంటావు. నేను కుటుంబాన్ని గెలిపించాలని అనుకుంటాను. అందుకే నేను గెలుస్తాను. నాకు ఓడిపోతాననే భయం లేదు అంటుంది దీప. భయం చాలా విలువైనది దీప. కచ్చితంగా నీకు భయం పరిచయం చేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. మీ అమ్మానాన్న నీ పెళ్లి చూడాలి అనుకుంటున్నారు. నువ్వు ఈ ఆటలన్నీ ఆపేసి.. పెళ్లి గురించి ఆలోచించు అని కౌంటర్ ఇస్తుంది దీప.
26
దాసుపై కాశీ ఫైర్
మరోవైపు ఏంటి నాన్న ఇలా చేశావు. నీ కొడుక్కి నువ్వే అన్యాయం చేస్తావా అని దాసుపై ఫైర్ అవుతాడు కాశీ. స్వప్న కోసమే కదా నేను ఇక్కడ డ్రైవర్ గా చేరింది. లేకపోతే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను. నువ్వేమో తన కోసం పెళ్లి కొడుకును తీసుకొచ్చావు అని సీరియస్ అవుతాడు కాశీ. నీ మీద కోపంతో స్వప్న పెళ్లికి ఒప్పుకుంది కానీ.. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదురా అని చెప్తాడు దాసు. స్వప్నకు తనలో ఉన్న ప్రేమను గుర్తు చేయమని కాశీకి సలహా ఇస్తాడు కార్తీక్.
36
కార్తీక్ కొత్త ప్లాన్
అంతలో కార్తీక్, దాసుకు ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావు మామయ్య అంటే.. ఒక మంచి పని చేస్తున్నాను అని చెప్తాడు దాసు. అయితే నువ్వు ఇంకో మంచి పని చేయాలి మామయ్య అంటాడు కార్తీక్. ఏంటో చెప్పు అల్లుడు అంటాడు దాసు. ఓ అబద్ధాన్ని నిజమని చెప్పాలి అని దాసుకు ఓ ప్లాన్ చెప్తాడు కార్తీక్. అది విని షాక్ అవుతాడు దాసు. నాకే ఇలా ఉంటే మా అమ్మకు ఎలా ఉంటుందో అని ఫోన్ కట్ చేస్తాడు దాసు. ఎన్ని మాటలు అన్నావు పారు.. చూడు నీ పని ఎలా చెప్తానో అని మనసులో అనుకుంటాడు కార్తీక్.
వీలునామా గురించి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. జ్యూస్ తీసుకొని జ్యోత్స్న దగ్గరకు వెళ్తుంది పారు. ఆస్తి ఎక్కడికి పోలేదు. ఇదంతా మీ అమ్మానాన్న వేసిన స్కెచ్. నువ్వు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని, పిల్లలను కంటే ఆస్తి మొత్తం నీదే అవుతుంది అంటుంది పారు. 15 నెలల్లో పెళ్లి చేసుకొని, పిల్లలను కనడానికి నేనేమైనా మెషిన్ అనుకుంటున్నావా అని సీరియస్ అవుతుంది జ్యోత్స్న.
56
నాకు ఆస్తి వద్దు
మరోవైపు నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు నాన్న అంటుంది దీప. ఇంకా ఏం చేయాలి? ఇన్ని రోజులు నా భార్య గురించి, నా కూతురి కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి నేను ఎంతలా నలిగిపోయానో నాకే తెలుసు అంటాడు దశరథ. జ్యోత్స్నను చిన్నప్పటి నుంచి నా కూతురి లాగే పెంచాను. తనని వదిలేయలేను. సుమిత్ర కోరిక తీర్చకుండా ఉండలేను. నా సొంత కూతురికి న్యాయం చేయకుండా ఉండలేను.
ఈ మూడింటి పరిష్కారం కోసమే వీలునామా మార్చి రాశాను. ఇక నేను ఉన్నా లేకున్నా ఆస్తి మొత్తం నా కూతురికే చెందుతుంది అంటాడు దశరథ. నాకు ఆస్తి వద్దు నాన్న.. జ్యోత్స్నకే ఇవ్వు. నాకు మీరు చాలు అంటుంది దీప. నిజం తెలిసిన రోజు తను నాకు కూడా హాని తలపెట్టే అవకాశం ఉంది. తండ్రినే చంపాలనుకున్న మనిషికి నన్ను ఏదో ఒకటి చేయడం పెద్ద పని కాదు అంటాడు దశరథ. జ్యోత్స్న నిజం తెలుసుకునే ప్రయత్నమే చేస్తోంది అంటాడు కార్తీక్.
66
కాంచన డౌట్
మరోవైపు కార్తీక్, దీప, కాంచన మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ నాకో డౌట్.. మా అన్నయ్య మేనల్లుడి కుటుంబానికి ఆస్తి అని వీలునామా ఎందుకు రాయించాడు. దీపను తన కూతురితో సమానంగా ఎలా చూస్తాడు అని అడుగుతుంది కాంచన. జ్యోత్స్నకు బుద్ధొచ్చి పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీనే కదా అంటాడు కార్తీక్.
హా హ్యాపీనే అంటుంది కాంచన. మరి నువ్వు దీప అంటాడు కార్తీక్. నాకు కూడా సంతోషమే అంటుంది దీప. మరి ఇక ఆలోచించడం ఎందుకు మంచి జరగాలని కోరుకోండి అంటాడు కార్తీక్. నిజం చెప్పరా మా అన్నయ్య ఆ వీలునామా రాయడం వెనుక నీ హస్తం లేదు కదా అంటుంది కాంచన. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.