సిగ్గులేకుండా ప్రేరణ చేసిన పని ఇదే, అక్కా అంటూ యష్మిపై గౌతమ్‌ రివేంజ్‌, ఈ వారం నామినేషన్స్ లిస్ట్

First Published | Oct 28, 2024, 11:58 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 తొమ్మిదో వారం నామినేషన్ల లిస్ట్ ఫైనల్‌ అయ్యింది. ఇందులో ప్రేరణ చేసిన కామెంట్‌, యష్మిని గౌతమ్ ఆడుకున్న తీరు హైలైట్‌గా నిలిచింది. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. పలు ట్విస్ట్ లు, టర్న్ ల నేపథ్యంలో ఇప్పటి వరకు 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అయ్యారు. వారిలో మణికంఠ స్వతహాగా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆయన వెళ్తూ గౌతమ్‌ని సేవ్‌ చేశాడు. ఇక ఎనిమిదో వారం మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడు తొమ్మిదో వారం ప్రారంభమంది. వారం ప్రారంభంలోనే అవినాష్‌ ట్విస్ట్ ఇచ్చారు. అనారోగ్యం కారణంగా తాను ఎలిమినేట్‌ అవినాష్‌ ఎలిమినేట్‌ అవుతున్నట్టుగా చూపించారు. కడుపు నొప్పితో బాధపడుతున్న అవినాష్‌ హౌజ్‌ని అర్థాంతరంగా వీడాడు. దీంతో హౌజ్‌ మేట్స్ అంతా షాక్‌ అయ్యారు. 

బిగ్ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అవినాష్‌ ఎలిమినేట్‌ అవుతున్నాడని చెప్పి హౌజ్‌ మొత్తం ఎమోషల్‌ అయ్యింది. గంగవ్వ, రోహిణి, నిఖిల్‌, యష్మి, తేజ, హరితేజ, విష్ణుప్రియా షాక్‌ అయ్యారు. అనంతరం కాసేపు ట్విస్ట్ అనంతరం మళ్లీ సడెన్‌గా హౌజ్‌లోకి వచ్చాడు అవినాష్‌. స్కానింగ్‌ చేశారని, ఫుడ్‌ పాయిజన్‌ అయినట్టుగా గుర్తించినట్టు తెలిపారు అవినాష్‌. ఆయన రాకతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక తొమ్మిదో వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. అయితే ఈ వారంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు నాగ్‌. మెగా చీఫ్‌ విష్ణుప్రియానే నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. ఆమె ఐదుగురు కంటెస్టెంట్లని నామినేట్‌ చేయాల్సి ఉంది. 
 


అందులో భాగంగా ఆమె గౌతమ్‌, ప్రేరణ, నయని పావని, నబీల్‌, తేజలను నామినేట్‌ చేసింది. గౌతమ్‌ని నామినేట్‌ చేసే సమయంలో యష్మి ప్రస్తావన వచ్చింది. ఈ సమయంలో అక్కా అక్కా అంటూ యష్మిని సంభోదించడం హైలైట్‌గా నిలిచింది. దీనికి ఆమె ఫ్రస్టేట్‌ అయ్యింది. తనని అలా పిలవొద్దంటూ వాదించింది. ఆమెని మరింతగా రెచ్చగొట్టాడు గౌతమ్‌. మొత్తంగా తన లవ్‌ని యాక్సెప్ట్ చేయనందుకు గౌతమ్‌ మనసులో గట్టిగానే పెట్టుకున్నాడు.

ఆ రివేంజ్‌ అంతా అక్కా అక్కా అంటూ తీర్చుకుంటున్నాడు. ఆమెని మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దీనికి ఆమె కూడా బాగా ఫర్‌ అయ్యింది. అలా పిలవొద్దు తనకు కంఫర్ట్‌ గా లేదని తెలిపింది. అయితే గత ఎపిసోడ్‌లో గౌతమ్‌కి తెగేసి చెప్పింది యష్మి. నీతో అలాంటి ఫీలింగ్‌ రావడం లేదని చెప్పేసింది. తాను కేవలం ఫ్రెండ్‌గానే చూస్తున్నట్టు వెల్లడించింది.దీంతో ఇంకెప్పుడు నీ జోలికి రాను, డిస్టర్బ్ చేయనని చెప్పాడు గౌతమ్‌.

కానీ తన మనసులో ఆమెపై కోపం ఉందనే విషయాన్ని ఇలా అక్కా అక్కా అంటూ తీర్చేసుకున్నాడు గౌతమ్‌. వీరిద్దరి మధ్య కాసేపు గట్టిగానే వాగ్వాదం జరిగింది. ఇందులో పృథ్వీ..నబీల్‌ని సేవ్‌ చేస్తూ, అవినాష్‌ ని స్వైప్‌ చేశాడు యష్మి.. ప్రేరణని సేవ్‌ చేస్తూ హరితేజని నామినేట్‌ చేసింది. రోహిణి.. అవినాష్‌ని సేవ్‌ చేస్తూ, పృథ్వీనీ నామినేట్‌ చేసింది. అవినాష్‌.. తేజని సేవ్‌ చేస్తూ, యష్మిని నామినేట్‌ చేశాడు. ప్రేరణ.. పృథ్వీని సేవ్‌ చేస్తూ తేజని నామినేట్‌ చేసింది.

అయితే తేజని నామినేట్‌ చేసేందుకు సరైన పాయింట్‌ లేదని, తన క్లాన్‌ కోసం నామినేట్‌ చేస్తున్నా అని, సిగ్గులేకుండా చెబుతున్నా అని, తేజని నామినేట్‌ చేసింది. ఇది విన్నాక తేజ.. ఇంత జరిగాక తాను వాదించడం వేస్ట్ అంటూ జైల్‌కి వెళ్లాడు. ఈ వారం నామినేట్‌ అయిన వాళ్లని జైల్లో పెట్టిన విషయం తెలిసిందే ఇలా మొత్తంగా తొమ్మిదో వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన వారిలో గౌతమ్‌, నయని పావని, హరితేజ, యష్మి, తేజ ఉన్నారు. మరి వీరిలో ఎవరు హౌజ్‌ని వీడతారో చూడాలి. 

read more: సీనియర్‌ ఎన్టీఆర్‌, జూ ఎన్టీఆర్‌లో ఉన్న కామన్‌ టేస్ట్ ఏంటో తెలుసా? నందమూరి హీరోల్లో ఎవరూ అలా చేయరు

also read: రాజీవ్‌ గాంధీని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? పేరెంట్స్ పెద్ద షాక్‌

Latest Videos

click me!