షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదల కానీ తమన్నా సినిమా.. డైరెక్టర్‌ ఎవరో తెలుస్తే నోరెళ్లబెట్టాల్సిందే

First Published | Oct 28, 2024, 8:39 PM IST

తమన్నా నటించిన సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. షూటింగ్‌ పూర్తి చేసుకుని రెడీగా ఉంది అయినా రిలీజ్‌ చేయలేదు. దీనికి దర్శకుడు ఎవరో తెలిస్తే మాత్రం షాకే.
 

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. హిందీ, తమిళంలో ఆమె సినిమాలు చేసినా టాలీవుడ్‌ ఆమెకి లైఫ్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. నటిగా ఆమెని మరోస్థాయికి తీసుకెళ్లింది. తిరుగులేని స్టార్‌ స్టేటస్‌ని అందించింది. అయితే ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాల పెద్దగా చేయడం లేదు తమన్నా. వెబ్‌ సిరీస్‌లు, స్పెషల్‌ సాంగ్‌లతో ఆకట్టుకుంటుంది. బాలీవుడ్‌ ఒకటి అర సినిమాలు చేస్తుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఇదిలా ఉంటే దాదాపు ఇరవై ఏళ్ల కెరీర్‌లో సుమారు డెబై మూవీస్‌ చేసింది. గ్లామర్‌ క్వీన్‌గా ఆకట్టుకుంది. అద్భుతమైన డాన్సులతో ఉర్రూతలూగించింది. ఆమె డాన్స్ లకు సెపరేట్‌ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. అయితే నటిగా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది తమన్నా. గ్లామర్‌ సైడ్‌గానే ఆమె ఫోకస్‌ అయ్యింది. మేకర్స్ కూడా తమన్నాని అలానే చూపించారు. అయితే ఇప్పుడు రూట్‌ మార్చింది. బలమైన కంటెంట్‌ ఉన్న చిత్రాలు చేస్తుంది. అలాంటి వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. మరోవైపు బోల్డ్ రోల్స్ కూడా చేస్తుంది. ఇటీవల ఆమె చేసిన `లస్ట్ స్టోరీస్‌ 2`, `జీ కర్దా` లో ఆమె విశ్వరూపం చూపించింది. గ్లామర్‌ సైడ్‌ నెక్ట్స్ లెవల్‌ చూపించింది. 
 


ఇదిలా ఉంటే తమన్నా నటించిన ఓ సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ డైరెక్టర్‌ గురించి షాక్‌ అవ్వాల్సిందే. అంతేకాదు ఇందులో మరో హీరోయిన్‌ కూడా ఉంది. ఆ వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తమన్నా, ఇలియానా నటించిన ఈ సినిమా పేరు `జాదు`. ఇది తమిళంలో `కేడీ`గా రూపొందింది. అయితే అక్కడ విడుదలైంది. మన తెలుగులో విడుదల కాలేదు. మెయిన్‌గా దీన్ని తెలుగు సినిమాగానే విడుదల చేయాలనుకున్నారు. మేలోనే సినిమాని రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ తెలుగులో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ డిలే అయ్యింది. పలు సమస్యలు నెలకొన్నాయట. దీంతో తమిళంలో పూర్తి చేసి సెప్టెంబర్‌ 24న విడుదల చేశారు.  
 

ఈ సినిమాకి సంబంధించిన తెలుగు టీజర్‌, ట్రైలర్‌, పాటలు విడుదల చేశారు. అవి యూట్యూబ్‌లో ఇప్పటికీ కనిపిస్తాయి. అయితే ఈ సినిమాకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించడం విశేషం. ఆయన ఎవరో కాదు ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌తో `హరిహర వీరమల్లు` సినిమాని రూపొందిస్తున్న దర్శకుడు జ్యోతికృష్ణ. తన అన్న రవికృష్ణ హీరోగా, తమన్నా, ఇలియానా హీరోయిన్లుగా నటించారు. ఇందులో తమన్నాది నెగటివ్‌ షేడ్‌ ఉన్న రోల్‌ కావడం ఓ విశేషమైతే, ఇది తమన్నాకి, ఇలియానాకి తొలి తమిళ సినిమా కావడం. భారీ బడ్జెట్‌తో నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. 
 

`జాదు`(కేడీ) సినిమా దర్శకుడు జ్యోతికృష్ణకి దర్శకుడిగా తొలి సినిమా. పెద్ద దెబ్బకొట్టింది. ఆ తర్వాత `నీ మనసు నాకు తెలుసు`, `ఆక్సిజన్‌`, `రూల్స్ రంజాన్‌` చిత్రాలు చేశారు. అన్నీ పరాజయం చెందాయి. ఇప్పుడు ఏకంగా పవన్‌ కళ్యాణ్‌తో `హరిహర వీరమల్లు` సినిమా చేస్తుండటం విశేషం. ఈ మూవీకి క్రిష్‌ దర్శకుడు. టీమ్‌తో ఏర్పడిన క్రియేటివ్‌ డిఫరెన్స్ కారణంగా ఆయన తప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన పర్యవేక్షణ ఉంటుందని టీమ్‌ వెల్లడించింది. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. బాబీ డియోల్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.  
 

తమన్నా చివరగా తెలుగులో `భోళా శంకర్‌` సినిమాలో హీరోయిన్‌గా మెరిసింది. ఈ మూవీ పరాజయం చెందింది. ఇప్పుడు ఆమె `ఓడెల 2` సినిమాలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. తొలి పార్ట్ పెద్ద హిట్‌ కావడంతో దీనికి సీక్వెల్‌ని తీసుకొస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. దీంతోపాటు హిందీలో ఓ సినిమా చేస్తుంది తమన్నా. ఇక ఇలియానా ఆల్మోస్ట్ సినిమాలు మానేసింది. ఆమె కొడుక్కి జన్మనిచ్చింది. కొడుకుని చూసుకుంటూ బిజీగా ఉంది.  

read more: సీనియర్‌ ఎన్టీఆర్‌, జూ ఎన్టీఆర్‌లో ఉన్న కామన్‌ టేస్ట్ ఏంటో తెలుసా? నందమూరి హీరోల్లో ఎవరూ అలా చేయరు!

also read: రాజీవ్‌ గాంధీని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? పేరెంట్స్ పెద్ద షాక్‌

Latest Videos

click me!