ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత స్టార్ గా వెలుగొందిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. 1961లో ఇందిరా దేవిని కృష్ణ వివాహం చేసుకున్నారు. ఇందిరాదేవి కృష్ణకు మరదలు అని సమాచారం. ఇందిరాదేవి-కృష్ణలకు ఐదుగురు సంతానం. మహేష్ బాబు స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ప్రథమ కుమారుడు రమేష్ బాబు కన్నుమూశారు. నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. 2019లో విజయనిర్మల మరణించారు. 2022లో రోజుల వ్యవధిలో ఇందిరాదేవి, కృష్ణ కన్నుమూశారు.