Intinti Gruhalakshmi: సామ్రాట్ కి థాంక్స్ చెప్పిన దీపక్... తులసిని చూసి ఆనంద పడుతున్న ప్రేమ్!

Published : Aug 29, 2022, 10:34 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 29వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
17
Intinti Gruhalakshmi: సామ్రాట్ కి థాంక్స్ చెప్పిన దీపక్... తులసిని చూసి ఆనంద పడుతున్న ప్రేమ్!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... అనసూయ పరంధామయ్యతో, లాస్య కావాలనే తులసిని రెచ్చగొడుతుంది అని అంటుంది. అప్పుడు పరంధామయ్య  తులసికి మంచేదో,చెడు ఏదో తెలుసు,ఎలా ఎదుర్కోవాలో తెలుసు అని అంటాడు. ఆ తర్వాత సీన్లో లాస్య నందుతో తులసి గురించి మాట్లాడుతూ ఇద్దరు బాగున్నారు పక్క పక్కన నీ రెచ్చగొడుతూ ఉంటుంది. ఆ తర్వాత భూమి పూజ మొదలవుతుంది ప్రేమ్ అలాగ తులసిని చూస్తూ ఉంటాడు.
 

27

సామ్రాట్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడగగా ప్రేమ్ సామ్రాట్ ని హద్దుకొని, మా అమ్మ ఇన్నాళ్లు అందరికీ సేవలు చేసింది అయినా సరే తనకి రావాల్సిన గుర్తింపు రాలేదు. ఇన్నాళ్ళకి మీరు తనకొక దారి చూపించారు. తన కాళ్ళ మీద తను నిలబడడానికి సహాయం చేశారు మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారని మాటివ్వండి అంకుల్ అని అంటాడు. దానికి సామ్రాట్ నేనేమీ చేయలేదు తులసి గారికి తనలో ఉన్న ప్రతిభ తనని ఇంతవరకు తీసుకొచ్చింది అని అంటాడు. ఆ తర్వాత భూమి పూజ జరుగుతున్నప్పుడు పంతులుగారు తులసితో మీరు వచ్చారు కల వచ్చింది అని అంటాడు.
 

37

ఆ మాటలకు లాస్య, చూశావా అరగంట కూడా అవ్వలేదు పరిచయమై అప్పుడే పంతులును కూడా బుట్టలో వేసుకుంది. అసలు తనలో ఉన్నదేంటి మనలో లేనిదేంటి అని లాస్య అనగా దీపక్(తులసి తమ్ముడు) అక్కడికి వచ్చి "మంచితనం" అని అంటాడు.మీరు మా అక్కని ఎంత నీచంగా చూసారో నాకు తెలుసు ఇప్పుడు మా అక్క కింద పని వాళ్ళలో బతుకుతున్నారు అని వాళ్ళిద్దర్నీ తిట్టి తులసి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు నందు కుల్లుకొని ఆఖరికి వీడు కూడా నన్ను లోకువ చేసి మాట్లాడుతున్నాడు వీడు పని చెప్తాడు అని అనుకుంటాడు.
 

47

ఇంతట్లో సామ్రాట్ అక్కడికి వచ్చి మీరు తులసి గారి తమ్ముడు కదా అని అంటారు మీకు ఎలా తెలుసు అని అనగా తులసి గారు మీ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారిగాని మీ గురించి చాలా విన్నాను అని అంటారు. అప్పుడు లాస్య నందుతో ఇంత బాగా మాట్లాడుకోవడానికి వాళ్ళిద్దరికీ సమయం ఎక్కడ దొరికిందో అని నందుని రెచ్చగొడుతుంది. ఇంతట్లో దీపక్ ఎన్నున్నా ఏం లాభం లెండి పాతికేళ్లు నరకం చూసింది మా అక్క ఇప్పుడిప్పుడే తన కాళ్ళ మీద నిలబడుతుంది అని అనగా ఆ పాత బాధలు ఇప్పుడు ఎందుకు అయినా అలాంటప్పుడు మీరేం చేశారు ఆపకుండా అని సామ్రాట్ అడుగుతాడు.
 

57

ఎప్పటికప్పుడు మా అక్క నన్ను సంకెళ్లతో బంధించి దూరంగా ఉంచేది అని నందు వైపు చూస్తే కోపంగా మాట్లాడాడు దీపక్. నాకు మీ బాధ అర్థమైంది అని సామ్రాట్ అంటాడు.ఇంతట్లో లాస్య ఇప్పుడు నందు వైపు చూస్తూ మాట్లాడితే సామ్రాట్ కి అనుమానం వచ్చిన ప్లాన్ అంతా పోతుంది. అభి ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటుంది. ఇంతట్లో సరే మనం ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని సామ్రాట్ అనగా ప్రెస్ ఏంటి అని తులసి అంటుంది. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అని వాళ్ళు  చంపేస్తుంటే ఇస్తాను అని చెప్పాను అని అంటారు దానికి తులసి, నాకు భయం నేను రాను అని అనగా ఇంట్లో వాళ్ళందరూ కలిసి బతిమిలాడి అక్కడికి తీసుకువెళ్తారు అప్పుడు లాస్య చూసావా నందు ఎప్పుడైనా నువ్ తులసిని ఇంత మతిమిలదవా? అని అనగా నీకు నన్ను తిట్టడం తప్ప ఇంకేం పని లేదా అని తిడతాడు నందు.
 

67

ఆ తర్వాత ఇంటర్వ్యూ దగ్గర ఇద్దరు కూర్చుని చాలా ప్రశ్నల కి జవాబిస్తారు. తులసి గారి పరిచయం మీకు ఎలా అనిపించింది అని అడగగా తులసి గారు నా వ్యాపార భాగస్వామి అంతకుమించి ఒక మంచి స్నేహితురాలు అని అంటారు. ఆ తర్వాత తులసి గారితో ఒక మగవాడి విజయం వెనక ఆడదాని కృషి ఉంటుంది అని అంటారు అలాగే మీ విజయం వెనకాతల ఎవరి కృషి ఉన్నది అని అడగగా నా విజయం వెనకాతల ఒక మగాడి కృషి కాదు ఒక మగాడి ఉక్రోషం ఉన్నది అని అంటుంది. తులసి అప్పుడు గతంలో జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకుంటుంది గతంలో నందుకి ఒక అవార్డు వస్తుంది అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూర్చుంటారు ఒక టీవీ వాళ్ళు వచ్చి నందుని ఇంటర్వ్యూ చేసి ప్రతి మగవాడి వెనకా ఒక ఆడదాని విజయం ఉంటుంది.
 

77

అలాగా తులసి గారు మీ విజయానికి ఎంతవరకు సహాయపడ్డారు అని అనగా నిజమే ప్రతి మగాడి వెనక ఆడదాని కృషి ఉంటుంది. అలాగే నా జీవితంలో కూడా ఒక ఆడదాని కృషి ఉన్నది కానీ మీరు అనుకుంటున్నారు అది నా భార్య తులసిది కాదు. తను ఇంటి మనిషి. వంట చేయడం టీ పెట్టడం తప్ప నాకు సహాయం చేయగలిగే అంత చదువు తనికి లేదు. నా విజయానికి కారణం మరెవరో కాదు లాస్య అని చెప్పి వెళ్లి టీ తీసుకురా తులసి అని అంటాడు నందు. తులసి ఆ మాటలకు ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని తులసి గుర్తుతెచ్చుకుంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories