Intinti Gruhalakshmi: తులసిని ఆ విషయంలో అపార్థం చేసుకున్న నందు.. తండ్రికి ఎదురుపడిన ప్రేమ్!

Published : Apr 13, 2022, 02:10 PM ISTUpdated : Apr 13, 2022, 02:13 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalaxmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకాదరణ భారీ స్థాయిలో పొందింది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Intinti Gruhalakshmi: తులసిని ఆ విషయంలో అపార్థం చేసుకున్న నందు.. తండ్రికి ఎదురుపడిన ప్రేమ్!

ఇక ఫ్యామిలీ మొత్తం ఇంటి నుంచి బయటకు వెళుతున్న  క్రమంలో రాములమ్మ (Ramaulamma) మీకు ఋణం తీరిపోయింది ఈ ఇంటితో కానీ నాతో కాదు కదా అమ్మా అని అంటుంది. దాంతో తులసి (Tulasi) ప్రస్తుతం మా జీవితాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి అని చెబుతుంది. ఇక ఫ్యామిలీ మొత్తం కన్నీటి శోకంతో ఇంటి నుంచి బయటకు వెళ్తారు.
 

26

ఆ క్రమంలో అంకిత్ (Ankith) ఆనంద నిలయం అనే బోర్డు ను కూడా అక్కడి నుంచి తీసుకుని వెళతాడు. మరోవైపు ప్రేమ్ వాళ్ళ తల్లి పరిస్థితి తెలిసి మనసులో ఎంతో బాధపడుతూ ఉంటాడు. అదే క్రమంలో ప్రేమ్ (Prem)  నీకు రావడం ఇష్టం లేకపోతే చెప్పు మా అమ్మ దగ్గరకి నేను ఒక్కడినే వెళ్తాను అని అంటాడు.
 

36

దానికి శృతి (Shruthi) అంగీకరించక పోగా.. ఇప్పుడు అమ్మ పెద్ద సమస్యలో ఉందని ప్రేమ్ (Prem)  అంటాడు. తనకున్న సమస్యల కంటే నువ్వే పెద్ద సమస్యగా అనుకుంటుంది ఆంటీ అని శృతి అంటుంది. ఇక శృతి వెళితే వెళ్ళు కానీ అతిగా ఆశ పెట్టుకొని బయలుదేరకు అని అంటుంది.
 

46

ఒకవైపు తులసి (Tulasi) ఫ్యామిలీ అంతా కొత్త ఇంట్లోకి వెళుతూ కొంతవరకు ఆనంద పడుతూ ఉంటారు. మరో వైపు నందు మనం తులసి వాళ్ళ ఇంటికి వెళ్లాలని లాస్య తో అంటాడు. దాంతో లాస్య (Lasya) ఇక మన మధ్య తులసి టాపిక్ రాకూడదు అని లాస్య విరుచుకు పడుతుంది.
 

56

ఇక తరువాయి భాగం లో నందు (Nandu) తులసి దగ్గరికి వెళ్లి నిన్ను గుడ్డిగా నమ్మినందుకు మా అమ్మ నాన్నలను తీసుకువచ్చి ఈ పిచుక గూటిలో పడేసావు అంటాడు. దాంతో తులసి (Tulasi) యుద్ధభూమి నుంచి పారిపోయిన సైనికుడికి చివరి వరకు పోరాడిన సైనికుని ప్రశ్నించే హక్కు లేదు అని అంటుంది.
 

66

ఇక కోపంతో అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతున్న నందు (Nandu) కు ప్రేమ్ ఎదురైవుతాడు. దాంతో నందు నేను గుమ్మం దాటగానే మీ ముద్దుల కొడుకు ని పిలిపించుకున్నావ్ అని తులసి (Tulasi)  ను అంటాడు. ఇక తులసి మళ్లీ వీడిని ఎందుకు తీసుకు వచ్చావు అని శృతి పై కోపం తెచ్చుకుంటుంది.

click me!

Recommended Stories