Ennenno Janmala Bandham: అభిమన్యుని దెబ్బ కొట్టెందుకు సూపర్ ప్లాన్ చేసిన వేద.. డీఎన్ఏ వద్దన్నా యష్!

Published : Apr 13, 2022, 01:54 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala bandam) సీరియల్ తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకాదరణ భారీస్థాయిలో పొందింది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
15
Ennenno Janmala Bandham: అభిమన్యుని దెబ్బ కొట్టెందుకు సూపర్ ప్లాన్ చేసిన వేద.. డీఎన్ఏ వద్దన్నా యష్!

యష్ (Yash) ఆఫీసులో ఉండగా వేద (Vedha) అక్కడికి వెళ్లి నాకు తెలిసిన డాక్టర్ తో డిస్కస్ చేశాను. నీకు ఖుషి కి డిఎన్ఏ టెస్ట్ చేస్తే తండ్రి ఎవరో తెలిసి పోతారు. అప్పుడు మీ సమస్యకు పరిష్కారం తీరుతుంది అని చెబుతుంది. దానికి యష్ ఏ మాత్రం అంగీకరించక వేద పై చిరాకు పడుతూ ఉంటాడు.
 

25

ఇక వేద (Vedha) టెస్ట్ చేయించుకోవడానికి మీకేంటి ఇబ్బంది అని అడుగుతుంది. దాంతో యష్ (Yash)  మనసులో ఒకవేళ నెగిటివ్ వస్తే ఆ బాధ నేను తట్టుకోలేను అని అనుకుంటాడు. అంతేకాకుండా నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను పాజిటివ్ వస్తే ఓకే.. ఒకవేళ నెగటివ్ వస్తే అని వేద ను అడుగుతాడు. అందుకే నేను ఈ టెస్ట్ చేయించుకోను అంటాడు.
 

35

ఇక వేద (Vedha) నా బిడ్డకు ఏదైనా సమస్య వస్తే ఎంత దూరమైనా వెళ్తాను అని యష్ కు చెప్పి వెళుతుంది. అక్కడి నుంచి వేద అభిమన్యు దంపతుల దగ్గరికి వెళ్లి వాళ్ళిద్దరిని నానా మాటలతో దెప్పి పొడుస్తుంది. ఇక అసలు నిజాన్ని రుజువు చేస్తాను అని చెప్పి అభిమన్యు (Abhimanyu) ని మిస్టర్ లూజర్ అని అక్కడి నుంచి వెళిపోతుంది.
 

45

ఆ తర్వాత వేద (Vedha) ఇంటికి వెళ్లి ఈ నైట్ ఈయన గారి హెయిర్ బ్లడ్ శాంపిల్ కోసం కలెక్ట్ చెయ్యాలి అని అనుకుంటుంది. ఇక యష్ (Yash) పడుకొని ఉండగా కత్తెర తో జుట్టును కట్ చేయడానికి వేద యష్ మీదకి వెళుతుంది. ఆ క్రమంలో యష్ కళ్ళు తెరుస్తాడు. ఇద్దరూ కళ్ళలో కళ్ళు పెట్టి ఒకరికొకరు రొమాంటిక్ గా చూసుకుంటారు.
 

55

ఆ తరువాత యష్ (Yash) చి చి.. నా మీద పడతావు ఏంటి అని చిరాకు పడతాడు. ఇక వేద బల్లి అంటే నాకు భయం అందుకే అలా చేయాల్సి వచ్చింది అని కవర్ చేసుకుంటుంది. ఇక తరువాయి భాగం లో యష్, వేదలు ఇద్దరు పట్టు వస్త్రాలు కట్టుకొని అందంగా శ్రీరాముడు పూజలో పాల్గొంటారు. ఈలోపు అక్కడకు మాళవిక (Malavika) వస్తుంది. ఇక రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories