Intinti Gruhalaxmi: తులసిని నిందించిన ప్రేమ్, శృతి.. ఫ్రెండ్స్ తో పార్టీలు అంటూ అతి చేస్తున్న దివ్య!

Published : Mar 16, 2022, 01:14 PM IST

Intinti Gruhalaxmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalaxmi) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఒక ఇంటి కుటుంబ నేపథ్యంతో ఈ సీరియల్ కొనసాగుతుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Intinti Gruhalaxmi: తులసిని నిందించిన ప్రేమ్, శృతి.. ఫ్రెండ్స్ తో పార్టీలు అంటూ అతి చేస్తున్న దివ్య!

 ప్రేమ్, శృతి (Sruthi) లు కూరగాయల కోసం నడుచుకుంటూ వెళతారు. ఆ క్రమంలో చూసుకోకుండా శృతి, ప్రేమ్ (Prem) లు ఒక స్కూటీ కి అడ్డుపడతారు. దాంతో ఆ స్కూటీ ఓనర్ కసురుకుంటుంది. ఇక ఇందులో చెప్పాల్సిన విషయం ఏమిటంటే  ఆ స్కూటీ ఓనర్ ఎవరో కాదు తులసి (Tulasi). ఇక స్కూటీ కి అడ్డుపడింది తన కొడుకు కోడలు అని తెలిసి ఆశ్చర్యపోతుంది.
 

26

ఆ తర్వాత ప్రేమ్ (Prem) వాళ్ళమ్మతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన నీకు కోపం చల్లారలేదా అని అడుగుతాడు. అంతేకాకుండా ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అని ఒక్క మాట చెప్పు  ఎందుకు అని కూడా అడక్కుండా వెళ్ళిపోతాను అని ప్రేమ్ తులసి (Tulasi) తో అంటాడు.
 

36

ఇక తులసి ప్రేమ్ ( Prem) పై ప్రేమ చూపించలేక జరగబోయే విషయాలను గ్రహించుకొని తన కొడుకు అంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ తర్వాత ప్రేమ్ ఉంటున్న ఇంటి ఓనర్  అడ్వాన్స్ కట్టమని గోల చేస్తాడు. ఈలోపు రాములమ్మ (Ramulamma) వచ్చి అడ్వాన్స్ కడుతుంది.
 

46

మరోవైపు దివ్య (Divya) వాళ్ళ ఫ్రెండ్స్ ని పార్టీకి ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. లాస్య దివ్య వాళ్ళ ఫ్రెండ్స్ ని బాగా ట్రీట్ చేస్తుంది. దాంతో వాళ్లు అందరూ లాస్యను మెచ్చుకుంటారు. ఆ తర్వాత వాళ్ళందరూ లాస్య (Lasya) తో కలిసి డీజే టిల్లు సాంగ్ కి ఒక రేంజ్ లో స్టెప్పులు వేస్తారు.
 

56

ఆ తర్వాత దివ్య (Divya) మా ఫ్రెండ్స్ కోసం ఫుడ్ ఎం అరేంజ్ చేసారు ఆంటీ అని అడుగుతుంది. ఇక లాస్య (Lasya) బయటనుంచి వెరైటీ ఫుడ్ తెప్పిస్తున్నాను అని వాళ్ళతో చెబుతుంది. ఆ తర్వాత ఫుడ్ మొత్తం తినకుండా కొంత ఫుడ్ ను వదిలేస్తారు.
 

66

ఇక అది చూసిన తులసి (Tulasi) తిండి లేక బయట ఎంతో మంది ఏడుస్తున్నారని దివ్య పై విరుచుకు పడుతుంది. దాంతో దివ్య నేను మా డాడ్ డబ్బులతో తెచ్చుకున్నాను అని అంటుంది దాంతో తులసి దివ్య (Divya) చెంప మీద గట్టిగా కొడుతుంది.

click me!

Recommended Stories