ఈరోజు ఎపిసోడ్ లో రిషి నేనేదో తెలిసి తెలియకో అన్నాను అంటే అంత మాత్రానికి వెళ్ళిపోతారా అని అంటాడు. ఇంత పెద్ద శిక్ష వేస్తారా అని అనగా వెంటనే మహేంద్ర శిక్ష నీకు వేశానని నువ్వు అనుకుంటున్నావు కానీ నాకు నేనుగా శిక్ష వేసుకున్నానని నేను అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు రిషి డాడీ మీరు నాకు కావాలి, నాతో ఉండాలి. నేను ఒకవేళ తప్పు చేస్తే కొట్టి రిషి నువ్వు తప్పు చేస్తున్నావ్ అని నా మీద అరవండి కానీ నన్ను విడిచి వెళ్ళిపోకండి డాడ్ అని ఎమోషనల్ గా మాట్లాడుతాడు రిషి. అప్పుడు రిషి మాటలు విన్న జగతి వసుధార ఇద్దరు ఎమోషనల్ అవుతూ ఉంటారు.