Intinti Gruhalakshmi: కష్టాల్లో ఉన్న తులసిని ఆదుకున్న చిన్ననాటి ఫ్రెండ్.. కోపంతో భాగ్యను గెంటేసిన లాస్య!

Published : Apr 27, 2022, 02:14 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 27న ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
17
Intinti Gruhalakshmi: కష్టాల్లో ఉన్న తులసిని ఆదుకున్న చిన్ననాటి ఫ్రెండ్.. కోపంతో భాగ్యను గెంటేసిన లాస్య!

ఎపిసోడ్ ప్రారంభంలోనే.. తులసి (Tulasi) తో పాటు పరంధామయ్య, అనసూయ, దివ్య లు తెగ బాధ పడుతూ ఉంటారు. పైగా తమను ఆదుకునేవారు లేరు అన్నట్లుగా కనిపిస్తారు. ఇక మరుసటి రోజు తులసి తన బండిని కడుగుతూ ఉండగా అక్కడికి ప్రవళిక (Pravallika) అనే తులసి చిన్ననాటి స్నేహితురాలు వస్తుంది.
 

27

ఇక తులసి (Tulasi) ఆమెను గుర్తుపట్టడానికి కాసేపు సమయం తీసుకోగా.. ఆ తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలు అని తెలుసుకొని ఆశ్చర్యపోతుంది. నిన్ను చూసి పాతికేళ్లు అయ్యింది అంటూ ఒకప్పటి జ్ఞాపకాలను తలచుకొంటుంది. ఇక ప్రవళిక (Pravallika) కూడా తులసి చిన్నప్పుడు ఎలా ఉండేదో వివరిస్తుంది.
 

37

అలా ఇద్దరూ కాసేపు తమ తమ జీవితాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రవళిక తులసి (Tulasi) ని చూసి ఎన్నో బాధ్యతలు మోసే దానిలా కనిపిస్తున్నావు అని అంటుంది. అలా మాట్లాడుతూ ఉన్న ప్రవళిక (Pravallika) తన చేతిలో ఉన్న పేపర్ ను తీసి తులసికి ఇస్తుంది. వెంటనే తులసి అది చూసి సంతోషపడుతుంది.
 

47

నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ను రద్దు చేసిన ఫ్యాక్టరీ నడిపించేలా ఆదేశాలు వచ్చాయి అని అంటుంది ప్రవళిక (Pravallika) దాంతో తులసి (Tulasi) చెప్పలేనంత ఆనందంతో పొంగిపోతుంది. ఇక ప్రవళిక కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఈ విషయాన్ని తులసి తన అత్తమామలకు చెప్పుకుంటూ మురిసిపోతుంది.
 

57

ఇక వాళ్లు కూడా సంతోష పడగా.. ఈ విషయాన్ని వెంటనే దుఃఖంలో ఉన్న వర్క్ వర్కర్స్ కు చెప్పాలని అనుకుంటుంది. ఇక తులసి ఫ్యాక్టరీ తెరిచింది అని లాస్య కు తెలియడంతో వెంటనే లాస్య (Lasya) భాగ్య దగ్గరికి వెళ్లి అరుస్తుంది. అంతే కాకుండా భాగ్య (Bhagya) ఫోను తీసుకొని ముక్కలు చేస్తుంది.
 

67

ఇక తులసి (Tulasi) తమ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి అక్కడ వర్కర్స్ కు శుభవార్త వినిపిస్తుంది. అంతేకాకుండా ధైర్యం ఇస్తుంది. ఇక తను ఈ ఫ్యాక్టరీలో బాధ్యతలు తీసుకోను అని.. ఎందుకంటే ఫ్యాక్టరీ సీజ్ కావడానికి కారణం నా శత్రువులే అని భవిష్యత్తులో ఇటువంటి రాకూడదని బాధ్యతలు వదిలేస్తున్నానని అంటుంది.
 

77

మరోవైపు ప్రేమ్ (Prem) రాసిన పాటను ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కు అక్రమంగా ఇవ్వడంతో.. వెంటనే ప్రేమ్ మ్యూజిక్ డైరెక్టర్ పై అరుస్తాడు. ఇక తరువాయి భాగంలో పరంధామయ్య, అనసూయ లు ఎమోషనల్ అవుతూ ఉంటారు. దివ్య (Divya) కూడా తను చదువు మానేస్తాను అని అనడంతో వెంటనే తులసి స్పృహ కోల్పోతుంది.

click me!

Recommended Stories