Published : Apr 27, 2022, 01:52 PM ISTUpdated : Apr 27, 2022, 01:54 PM IST
అనుష్క బాహుబలి తర్వాత అంత యాక్టివ్ గా లేదు. బాహుబలి 2 తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించిన చిత్రం రెండు మాత్రమే. అవి భాగమతి ఒకటి కాగా.. మరొకటి ఇటీవల విడుదలైన నిశ్శబ్దం.
అనుష్క బాహుబలి తర్వాత అంత యాక్టివ్ గా లేదు. బాహుబలి 2 తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించిన చిత్రం రెండు మాత్రమే. అవి భాగమతి ఒకటి కాగా.. మరొకటి ఇటీవల విడుదలైన నిశ్శబ్దం. నిశ్శబ్దం చిత్రం అనుష్క అభిమానులని తీవ్రంగా నిరాశపరిచింది.
26
Anushka Shetty
అనుష్క సినిమాల గురించి ఎలాంటి న్యూస్ రాకపోవడంతో ఫ్యాన్స్ లో అనుమానాలు పెరిగాయి. బరువు కూడా పెరుగుతుండడంతో అనుష్క గురించి చాలా రూమర్స్ ఎక్కువయ్యాయి. అనుష్క ఇక సినిమాలకు దూరం అవుతోందని.. ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి చేసేందుకు రెడీ అవుతున్నారని ఊహాగానాలు వినిపించాయి.
36
Naveen Polishetty
ఇలాంటి తరుణంలో అనుష్క ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో పి మహేష్ దర్శకత్వంలో అనుష్క నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోగా జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నారు. జూన్ నుంచి ఈ చిత్ర షూటింగ్ షురూ కానుంది.
46
Naveen Polishetty
ఈ చిత్రంలో అనుష్క, నవీన్ పాత్రలపై ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది. అనుష్క ఈ చిత్రంలో అంతర్జాతీయంగా ఫేమస్ అయిన చెఫ్ పాత్రలో నటించబోతోంది. అంటే వంటలక్క అన్నమాట. తన రోల్ నచ్చడంతో అనుష్క ఈ చిత్రానికి వెంటనే ఒకే చెప్పింది.
56
Anushka Shetty
ఇక నవీన్ పోలిశెట్టి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటించబోతున్నాడు. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ కి యువత ఇప్పటికే అభిమానులుగా మారిపోయారు. ఈ చిత్రంలో కామెడీ హై డోస్ లో ఉండబోతున్నట్లు టాక్. అనుష్క చెఫ్ గా.. నవీన్ పోలిశెట్టి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పండించే కామెడీ ఊహించుకుంటుంటే దుమ్ములేచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
66
Anushka Shetty
అనుష్క మే నుంచి ఈ చిత్ర సెట్స్ లో జాయిన్ కానుంది. ప్రస్తుతం అనుష్క బరువు తగ్గేందుకు హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నవీన్ లాంటి యువ నటుడితో అనుష్క జత కట్టడం ఆసక్తిగా మారింది.