రాజమౌళి ఓ కాంట్రాక్టర్ అంటూ స్టార్ డైరెక్టర్ కామెంట్స్.. ఇలా చెప్పాలంటే అతడికి మాత్రమే సాధ్యం

Published : Oct 31, 2025, 08:42 PM IST

Baahubali The Epic: రాజమౌళి ఓ కాంట్రాక్టర్ అంటూ ఓ స్టార్ డైరెక్టర్ అభివర్ణించారు. జక్కన్న గురించి ఇలాంటి కామెంట్ చేయాలంటే ఆ దర్శకుడికి మాత్రమే సాధ్యం. 

PREV
15
రాజమౌళి గొప్ప ప్రయత్నం

ఎస్.ఎస్. రాజమౌళి చేసిన గొప్ప ప్రయత్నం బాహుబలి ఫ్రాంచైజీ. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం అది. రెండు భాగాలు భారీ విజయాలు సాధించదమే కాదు ఇండియన్ సినిమాలో సరికొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేశాయి. కొందరు ఫిలిం మేకర్స్ బాహుబలి కంటే రెట్టింపు బడ్జెట్ పెట్టి సినిమాలు తీసినా ఆ స్థాయిని అందుకోలేకపోయారు అంటే అతిశయోక్తి కాదు. 

25
బాహుబలి ది ఎపిక్ రిలీజ్ 

బాహుబలి రెండు చిత్రాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్'గా రీ-ఎడిట్ థియేటర్లలోకి తీసుకువచ్చారు. ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. బాహుబలి సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలా రీ రిలీజ్ చేయడం జరిగింది. దీనితో దర్శకుడు ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో రాజమౌళికి తన గౌరవాన్ని తెలిపారు. రాజమౌళి ఓ కాంట్రాక్టర్ అంటూ అభివర్ణించారు.  

35
రాజమౌళి ఓ కాంట్రాక్టర్ 

బాహుబలి ది ఎపిక్ రిలీజ్ సందర్భంగా ప్రశాంత్ నీల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'ఒక రోడ్డుకి మరమ్మత్తులు అవసరం అయ్యాయి. ఓ కాంట్రాక్టర్ ఆ రోడ్డు మరమ్మత్తుల బాధ్యత తీసుకున్నారు. ఆ కాంట్రాక్టర్ రోడ్డుని మరమ్మత్తులు చేయడం మాత్రమే కాదు దానిని 16 లేన్ల సూపర్ ఎక్స్ ప్రెస్ హైవే గా మార్చేశారు. ఆ రోడ్డుని అందరూ పాన్ ఇండియా అని పిలుస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ పేరు రాజమౌళి. ఒక తరం కోసం కలలు కన్న రాజమౌళికి ధన్యవాదాలు' అని ప్రశంసలు కురిపించారు. రాజమౌళి గురించి ఇంత అద్భుతంగా చెప్పాలంటే ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ కే సాధ్యం అని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ ప్రాంచైజీతో తిరుగులేని పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగారు. 

45
సింగిల్ వెర్షన్ గా బాహుబలి

బాహుబలి: ది ఎపిక్ అనేది బాహుబలి సింగిల్-ఫిల్మ్ వెర్షన్. ఇది రెండు చిత్రాల ఫుటేజ్‌ను అదనపు సాంకేతిక మెరుగుదలపునరుద్ధరించిన సన్నివేశాలు, ఎంపిక చేసిన ఎడిట్‌లతో మిళితం చేస్తుంది.

55
మరోసారి బాహుబలి మ్యాజిక్

ఈ చిత్రం అక్టోబర్ 31, 2025న IMAX, 4DX, D-Box, డాల్బీ సినిమా, EPIQ వంటి ప్రీమియం ఫార్మాట్లలో థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అయింది. మరోసారి ప్రేక్షకులు బాహుబలి మ్యాజిక్ ని థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories