సమంత రిజెక్ట్ చేసిన మూవీస్, అవి ఎలాంటి సినిమాలో తెలుసా ? అందుకే వరుస హిట్లు కొట్టింది

Published : Oct 31, 2025, 06:52 PM IST

సమంత తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. కొందరు హీరోయిన్లు సూపర్ హిట్ చిత్రాలని రిజెక్ట్ చేసి ఆ తర్వాత బాధపడుతుంటారు. కానీ సమంత ఎలాంటి సినిమాలు వదులుకుందో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
16
సమంత రిజెక్ట్ చేసిన సినిమాలు

స్టార్ హీరోయిన్ సమంత తన సినీ కెరీర్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించారు. వివాహం, విడాకులు, ఆరోగ్య సమస్యల వల్ల ఆమె కెరీర్ ఇప్పుడు నెమ్మదించింది. గతంలో మాత్రం సమంత వరుస విజయాలతో సౌత్ లోనే తిరుగులేని హీరోయిన్ గా కొనసాగింది. సమంత తన సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేది. సమంత తన కెరీర్ లో ఎలాంటి సినిమాలని రిజెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

26
ఎవడు

రాంచరణ్ సూపర్ హిట్ మూవీ ఎవడులో ముందుగా సమంతకి అవకాశం వచ్చింది. కానీ సమంత ఆరోగ్య సమస్యల కారణంగా ఆ చిత్రాన్ని వదులుకుంది. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

36
బ్రూస్ లీ

సమంత రిజెక్ట్ చేసిన మరో చిత్రం బ్రూస్ లీ. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల సామ్ ఈ చిత్రాన్ని వదులుకుంది. అయితే ఈ మూవీ మాత్రం డిజాస్టర్ అయింది. సమంత తప్పుకోవడంతో ఆ ఛాన్స్ రకుల్ ప్రీత్ సింగ్ కి వచ్చింది.

46
ఎన్టీఆర్ కథానాయకుడు

బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటి ఎన్టీఆర్ కథానాయకుడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ పూర్తిగా నిరాశపరిచింది. ఈ మూవీలో ఓ లెజెండ్రీ హీరోయిన్ పాత్రలో నటించేందుకు సమంతని సంప్రదించారు. కానీ సమంత ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసింది.

56

శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ లో వచ్చిన చిత్రం ఐ. ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఈ మూవీలో హీరోయిన్ గా శంకర్ ముందుగా సమంతని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సమంత ఈ చిత్రంలో నటించలేదు.

66
నిన్ను కోరి

సమంత నానికి జోడీగా ఈగ, ఏటో వెళ్ళిపోయింది మనసు లాంటి చిత్రాల్లో నటించింది. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం వచ్చింది. నిన్ను కోరి చిత్రంలో హీరోయిన్ గా ముందుగా సమంతని అనుకున్నారు. కానీ అదే సమయంలో సమంత చైతూతో పెళ్ళికి రెడీ అవుతుండడంతో రిజెక్ట్ చేసింది. సమంత తన కెరీర్ లో ఎక్కువగా ఫ్లాప్ అయిన చిత్రాలనే రిజెక్ట్ చేసింది. అందుకే సమంతకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories