ప్రభాస్‌ ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్‌ అయ్యే వార్త.. `సలార్‌ 2` ఇప్పుడే కాదా?.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ లో సంతోషం..

First Published | Feb 19, 2024, 6:18 AM IST

ప్రభాస్‌ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్‌ అయ్యే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. `సలార్‌2` నుంచి ఓ షాకింగ్‌ విషయం వినిపిస్తుంది. దీంతో తారక్‌ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

 ప్రభాస్‌ గతేడాదికి `సలార్‌`తో అదిరిపోయే షినిషింగ్‌ టచ్‌ ఇచ్చారు. ఇప్పుడు ఈ సమ్మర్‌తో బాక్సాఫీసు రికార్డులు షేక్‌ చేయడానికి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన `కల్కి2898ఏడీ` చిత్రంలో నటిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ రూపొందించే ఈ మూవీ ఈ మే 9న రాబోతుంది. అంతా ఈ మూవీ కోసం వెయిట్‌ చేస్తున్నారు. అలాగే `సలార్‌ 2` ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని ఆతృతగా ఉన్నారు. మూవీ రిలీజ్‌ అయిన తర్వాత నుంచి దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మీడియా కంట పడలేదు. 

`సలార్‌ 2` ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియడం లేదు. అంతా ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది రిలీజ్‌ అవకాశాలున్నట్టు అంటున్నారు. కానీ లేటెస్ట్ న్యూస్‌ మాత్రం ప్రభాస్‌ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్‌ అయ్యేలా చేస్తుంది. ప్రస్తుతానికి ప్రశాంత్‌ నీల్‌ మైండ్‌లో `సలార్‌ 2` చేయాలనే ప్లానే లేదట. దాన్ని నెమ్మదిగా చేయాలని భావిస్తున్నారట. ఇప్పుడు వెంటనే `సలార్‌ 2` చేయాలని అనుకోవడం లేదట. దానికి చాలా టైమ్‌ తీసుకునే ఆలోచనలో ఉన్నారట. 


ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌.. ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. నెక్ట్స్ మూవీ తారక్‌తోనే ఉంటుందని తెలసింది. ఈ మూవీని రెండేళ్ల క్రితమే ప్రకటించారు. `సలార్‌` తర్వాత ఇదే ప్రాజెక్ట్ ఉంటుందని వెల్లడించారు. కానీ `సలార్‌`ని రెండు పార్ట్ లుగా ప్రకటించిన తర్వాత నుంచి ఈ మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే డౌట్‌ స్టార్ట్ అయ్యింది. అది ఇటీవల `సలార్‌` రిలీజ్‌ అయ్యాక మరింత పెరిగింది. 
 

`సలార్‌` పెద్ద హిట్‌ కావడంతో వెంటనే `సలార్‌ 2` ఉంటుందని, ఆ తర్వాత ప్రాజెక్ట్ ఎన్టీఆర్‌తో ఉంటుందని భావించారు. అదే ప్రచారం జరిగింది. కానీ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మైండ్‌లో మాత్రం ఎన్టీఆర్‌ మూవీనే ఉందని తెలుస్తుంది. నెక్ట్స్ ఆయన ఈ ప్రాజెక్ట్ పైనే వర్క్ చేయబోతున్నారట. ఈ ఏడాదిలోనే ఈ మూవీని స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఎన్టీఆర్‌ నెక్ట్స్ ఇదే సినిమా ఉండేలా ఉంది. 
 

అయితే ఇందులో డార్లింగ్‌ ఫ్యాన్స్ మరింత డిజప్పాయింట్‌ అయ్యే మరోవార్త వినిపిస్తుంది. `సలార్‌ 2` రావడానికి మరో నాలుగేళ్లు పట్టే అవకాశాలున్నాయట. ఎన్టీఆర్‌ మూవీ తర్వాత `కేజీఎఫ్‌3`చేసే ఆలోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నారట. ఆ తర్వాత `సలార్‌ 2` రూపొందించే ఛాన్స్ ఉందని సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజమెంతా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం డార్లింగ్‌ ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్‌ అయ్యేలా చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 
 

ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం `కల్కి2898ఏడీ`లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా మూవీ `స్పిరిట్‌`ని ప్రారంభించే అవకాశం ఉందట. ఈ ఏడాది ఎండింగ్‌లో ఈ మూవీ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం దీనిపైనేవర్క్ చేస్తున్నారు సందీప్‌. ఈ లోపు ప్రభాస్‌ నుంచి `కల్కి`తోపాటు మారుతి మూవీ `రాజాసాబ్‌`ని విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత `స్పిరిట్‌` ఉంటుంది. ఆ తర్వాత హను రాఘవపూడి మూవీ ఉంటుందని టాక్‌. మరి నెక్ట్స్ ఏం జరుగుతుంది? ఏది ముందు ఏది తర్వాత అనేది కాలమే నిర్ణయించాలి. 
 

Latest Videos

click me!