Rukmini Vasanth : ఇండస్ట్రీకి మరో రష్మిక మందన్న... రుక్మిణి వసంత్ కు వస్తున్న ఆఫర్లు ఎలాంటివో తెలుసా?

Published : Feb 18, 2024, 10:04 PM IST

టాలీవుడ్ ప్రస్తుతం యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) పేరు బాగా వినిపిస్తోంది. అయితే ఈ కన్నడ బ్యూటీ మరో రష్మిక మందన్న (Rashmika Mandanna)లా మారబోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

PREV
16
Rukmini Vasanth : ఇండస్ట్రీకి మరో రష్మిక మందన్న... రుక్మిణి వసంత్ కు వస్తున్న ఆఫర్లు ఎలాంటివో తెలుసా?

కన్నడ ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్ పేరు ప్రస్తుతం టాలీవుడ్ Tollywood, కోలీవుడ్ Kollywoodలో గట్టిగా వినిపిస్తోంది. స్టార్ హీరోల సరసన ఈ ముద్దుగుమ్మను నటించమంటూ నిర్మాతలు సంప్రదిస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో మరో రష్మిక మందన్నలా మారుతుందంటున్నారు. 
 

26

ఇక.... నేషనల్ క్రష్ రష్మిక మందన్న రేంజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. ఇండియాలోని బిగ్ స్టార్స్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ‘పుష్ప2’ (Pushpa 2 The Rule)తో అలరించనుంది. 

36

ఇదిలా ఉంటే..  రష్మిక మందన్న తన మాజీ ప్రియుడు రక్షిత్ రెడ్డి (Rakshit Reddy)తో నటించిన ‘కిర్రిక్ పార్టీ’ తర్వాతే నటిగా గుర్తింపు పొందింది. కన్నడతో పాటు ఇతర భాషల్లో మంచి అవకాశాలు అందుకుంది.. ఇప్పుడు టాప్ హీరోయిన్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇప్పుడు రక్షిత్ ద్వారా మరో కన్నడ బ్యూటీ షైన్ అవుతోంది.

46

గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ చిత్రం ‘సప్త సాగరాలు దాటి - సైడ్ ఏ’  (Sapta Saagaradaache Ello – Side A), అలాగే సైడ్ -బీ చిత్రాలతో కన్నడ ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్ వెలుగులోకి వచ్చింది. ఆమె నటనతో అందరికీ ఆకట్టుకుంది. 

56

దీంతో ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా.. కోలీవుడ్, టాలీవుడ్ లోనూ ఈ ముద్దుగుమ్మకు సినిమా ఆఫర్లు వరుస పెట్టాయి. ప్రస్తుతం ఆయా చిత్రాలకు హీరోయిన్ గా టాక్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళంలో బిగ్ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకుంది రుక్మిణి వసంత్.

66

కోలీవుడ్ స్టార్ శివ కార్తీకేయన్ (Siva Karthikeyan) - మురుగుదాస్ కాంబోలో వస్తున్న చిత్రంలో రక్మిణిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ Vijay Deverakonda మూవీ VD12,  రవితేజ Ravi Teja - అనుదీప్ కాంబోలోని సినిమాలో అవకాశం అందుకుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories