Salaar విషయంలో ప్రశాంత్‌ నీల్‌ ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటేనా? .. ప్రభాస్‌ దెబ్బకి రికార్డులు అన్నీ బద్దలే!

First Published Dec 22, 2023, 6:30 PM IST

ప్రభాస్‌ నటించిన `సలార్‌` సినిమా ఆహో ఓహో అంటున్నారు. అదే సమయంలో ఇందులో చాలా మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అవి జరగకపోయి ఉంటే కథ వేరేలా ఉంది. మరి తప్పులేంటనేది చూస్తే, 

`సలార్‌` సినిమా బాక్సాఫీసు వద్ద మంచి రిజల్ట్ ని చవిచూస్తుంది. ప్రభాస్‌ కటౌట్‌, యాక్షన్‌ సీన్లు, ఎలివేషన్లు సినిమాని నిలబెట్టాయి. అసలైన ప్రభాస్‌ని చూడటంతో అంతా ఖుషి అవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ తీసుకోబోతుంది. లాంగ్‌ రన్‌లో భారీ కలెక్షన్లని సాధిస్తుందని చెప్పొచ్చు. అదే సమయంలో కొన్ని మిస్టేక్స్ లేకపోతే సినిమా రేంజ్‌ వేరే ఉండేదనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. 
 

`సలార్‌`లో హైలైట్స్ ఆల్‌రెడీ చూశాం. మరి మిస్టేక్స్ పై ఓ లుక్కేస్తే.. ఇందులోనూ చాలా మిస్టేక్స్ ఉన్నాయి. `కేజీఎఫ్‌` మాదిరిగా నీట్‌గా `సలార్‌`ని చెప్పలేకపోయాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఓ రకంగా ఆయన టెన్షన్‌ పడ్డాడని చెప్పొచ్చు. యాక్షన్‌, ఎలివేషన్ల మీద పెట్టిన దృష్టి ఎమోషన్స్ పై పెట్టలేకపోయాడు. `కేజీఎఫ్‌` మదర్‌ సెంటిమెంట్‌ తరహాలో ఇందులో స్నేహంపై వచ్చే ఎమోషన్స్ పండలేదు. జస్ట్ ఓకే అనిపించింది. ఆడియెన్స్ ని ఆ ఎమోషన్‌ టచ్‌ చేయలేకపోయింది. 

Latest Videos


ఇక కథలో క్లారిటీ లేదు. అసలు `సలార్‌`లో ఫ్రెండ్‌ షిప్‌ గురించి టచ్‌ చేశాడు, ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ ఒకరికోసం ఒకరు ఎలా నిలబడతారో చెప్పారు. కానీ దాని డెప్త్ చూపించలేకపోయాడు. అలాగే ఖాన్సార్‌ కథ, వంశాల గురించి చెప్పే విషయంలో క్లారిటీ మిస్‌ అయ్యింది. అలా ఫాస్ట్ గా వివరిస్తూ వెళ్లాడు, కానీ ఆడియెన్స్ కి రిజిస్టర్‌ చేయించలేకపోయాడు. దీంతో పాత్రల విషయంలో కన్‌ఫ్యూజన్‌ ఏర్పడించింది. చివరికి ప్రభాస్‌ పాత్ర విషయంలోనూ కన్‌ ఫ్యూజన్‌ నెలకొంది. 

 ట్రైలర్‌లో చూపించినట్టు.. తన స్నేహితుడు పృథ్వీరాజ్‌ని సింహాసనంపై కూర్చోబెడతాడు ప్రభాస్‌. కానీ సినిమాలో ఆ సీన్లు లేవు. ఆడియెన్స్ మాత్రం ఆ సీన్‌ ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు. అది రెండో భాగంలో వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు వీరిద్దరి మధ్య గొడవ ఎక్కడొచ్చిందనేది కూడా మిస్టరీగా వదిలేశాడు, సెకండ్‌ పార్ట్ కి వదిలేశాడు. దీంతో ఇవి కొంత అసంతృప్తిని మిగుల్చుతాయి. ప్రారంభంలో ఈశ్వరీ రావుతో వచ్చే సీన్లు కూడా అంతగా నచ్చేలా లేవు. ఏదో సినిమాని లాగేందుకు పెట్టుకున్నట్టుగానే అనిపిస్తాయి. కానీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. 

మరోవైపు ప్రభాస్‌ని కేవలం యాక్షన్‌, ఎలివేషన్లకి పరిమితం చేశాడు దర్శకుడు. ఆయనలో డైలాగులు లేవు. సినిమా మొత్తంలో మహా అయితే నాలుగు, ఐదు సార్లు మాత్రమే డైలాగులు చెబుతాడు. అవి కూడా సెకండాఫ్‌ కి దాచాడా? అనేది సస్పెన్స్. కానీ సినిమా చూస్తుంటే ప్రభాస్‌కి డైలాగులు తక్కువే అనిపిస్తుంది. దీంతోపాటు బీజీఎం కూడా గొప్పగా లేదు. `కేజీఎఫ్‌` సినిమాని చూస్తున్నట్టుగానే ఉంది. సేమ్‌ బీజీఎంని ఫాలో అయ్యాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి బన్సూర్‌. 

కలర్‌ టోన్‌ కూడా `కేజీఎఫ్‌`దే కావడంతో అదే ఫీలింగ్‌ కలుగుతుంది. కథ చెప్పే విధానం కూడా దాన్ని తలపించేలానే ఉంది. ఇదిలా ఉంటే సినిమాలో `కేజీఎఫ్‌` లింక్‌ ఉంటుందని, యష్‌ని చూపిస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ వారికి నిరాశే ఎదురయ్యింది. అలాగే అనేక ప్రశ్నలను వదిలేశాడు. ఖాన్సార్‌లో యాక్షన్‌ సీన్లలో అప్పటి వరకు గన్నులు వాడి, సడెన్‌గా కత్తితో ఫైట్లు చేయడం కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు స్లోగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లోనూ అదే ఉంటుంది. హడావుడి ఉంటుంది తప్ప, మ్యాటర్‌ లేదు. అది అంతగా కిక్‌ ఇవ్వలేకపోయింది. 

కానీ ఓవరాల్‌గా మాత్రం `సలార్‌` యాక్షన్‌ ట్రీట్‌ అని చెప్పొచ్చు. ఇటీవల యాక్షన్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన వచ్చిన సినిమాలను మించి ఉందని అని చెప్పొచ్చు. ప్రభాస్‌ కటౌట్‌, ఆయన ఎలివేషన్లు సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. మైనస్‌లను తక్కువ చేసేశాయి. ఒకవేళ పై మిస్టేక్స్ విషయంలో దర్శకుడు మరింత కేర్‌ తీసుకుని, కథని, ఎమోషన్స్ ని బలంగా డీల్‌ చేసి ఉంటే `సలార్‌` రేంజ్‌ ఊహకందని విధంగా ఉండేది. 
 

click me!