అయితే, ఆ మధ్యలో షారుఖ్ ఖాన్ సరసన ‘పఠాన్’లో దీపికా చేసిన డాన్స్ ఎంత ట్రెండ్ అయ్యిందో తెలిసిందే. ఇక ‘ఫైటర్’లో మరోసారి బీచ్ వేర్ లో దీపికా పదుకొణె దర్శనమిచ్చింది. హృతిక్ కు ధీటుగా డాన్స్ చేస్తూ ఆడియెన్స్ ను చూపుతిప్పుకోకుండా చేసింది. ఇక హృతిక్ రోషన్ ఎప్పటీ లాగే అదరగొట్టారు. ఐదు పదుల వయస్సు ఉన్న తన ఫిట్ నెస్ తో షాకిస్తూనే ఉన్నారు. సాంగ్ లో మాత్రం ట్యూన్, కొరియోగ్రఫీ, లోకేషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.