ఇక అప్పట్లో వరుస పెట్టి సినిమాలు చేసిన హేమ రెండేళ్లుగా పెద్దగా సినిమాలేవీ చేసినట్టు కనిపించలేదు. ప్రస్తుతం ‘శ్రావ్య’ అనే చిత్రంలో నటిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందంట. ఈ మూవీ నుంచి స్పష్టమైన అప్డేట్స్ లేవు. ఇదిలా ఉంటే... హేమ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలోని తన పాత్రకు నంది అవార్డును సొంతం చేసుకుంది.