రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి స్నేహితుడు ప్రమోద్ శెట్టి వ్యంగ్యంగా స్పందించారు. ఈ కామెంట్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
రష్మిక, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. ఈ జంట ఇంకా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. కానీ రష్మిక మాజీ ప్రియుడు, 'కిరిక్ పార్టీ' సహనటుడు రక్షిత్ శెట్టి స్నేహితుడైన ప్రమోద్ శెట్టి.. తనను పెళ్లికి పిలవరని మీడియాకు చెప్పారు.
26
వ్యంగ్యంగా నవ్వుతూ..
ప్రమోద్ శెట్టి వ్యంగ్యంగా నవ్వుతూ.. 'నాకు ఇంకా రష్మిక పెళ్లి పిలుపు అందలేదు. ఒకవేళ వస్తే వెళ్తా. ఆమె మమ్మల్ని పిలవదని తెలుసు, కొత్తేం కాదు. ఇక రక్షిత్ శెట్టి విషయానికొస్తే, అతను చాక్లెట్ తినే పిల్లాడేం కాదు, బాధపడుతూ కూర్చోవడానికి' అన్నారు.
36
రష్మిక అభిమానుల ఆగ్రహం..
ప్రమోద్ శెట్టి వ్యాఖ్యలపై నెటిజన్లు, రష్మిక అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. అతని కామెంట్స్‌ను 'చీప్' అని అభివర్ణించారు. బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడిని, అతని స్నేహితులను రష్మిక తన పెళ్లికి ఎందుకు పిలుస్తుందని ప్రశ్నిస్తున్నారు.
ఒక యూజర్ 'ప్రమోద్ శెట్టి.. ఎంత చీప్ మనిషివయ్యా! కొన్ని పద్ధతులు పాటించు!' అని కామెంట్ చేశారు. మరొకరు 'ప్రమోద్, నీకు కాస్తైనా మెచ్యూరిటీ ఉందని ఆశిస్తున్నా. ఒకరి గురించి పబ్లిక్‌గా ఎలా మాట్లాడాలో ఓ పద్ధతి ఉంటుంది. ఇది సరైన విధానం కాదు' అని రాశారు.
56
ఎందుకు పిలవాలంటూ ప్రశ్నలు..?
మరో యూజర్ స్పందిస్తూ.. 'మీరంతా ఆమెను వేధించారు. తనను వేధించిన, అవమానించిన వాళ్లను ఆమె ఎందుకు పిలుస్తుంది? తనకు కన్నడ రాదని ఆమె ఎప్పుడూ చెప్పలేదు' అన్నారు. 'ఈ అంకుల్‌ను కర్ణాటక బయట ఎవరికి తెలుసు? రక్షిత్‌కు ఇలాంటి చప్రీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడో' అని ఇంకొకరు కామెంట్ చేశారు.
66
రక్షిత్ శెట్టితో రష్మిక బ్రేకప్..
రష్మిక 2016లో కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ'తో నటిగా అరంగేట్రం చేసింది. జూలై 2017లో, తన 21వ ఏట, తన కంటే 13 ఏళ్లు పెద్దవాడైన సహనటుడు రక్షిత్ శెట్టితో ఆమె నిశ్చితార్థం జరిగింది. అయితే, సెప్టెంబర్ 2018లో ఈ ఎంగేజ్‌మెంట్ రద్దయింది.