రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రాబోతున్న 'వారణాసి' సినిమాలో ఆయన రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో ఈ పాత్ర ఉంటుందట. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా కథ కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా, వేర్వేరు ఖండాలు, కాలాల్లో సాగుతుందని సమాచారం. రాజమౌళి మరోసారి బాహుబలిని మించిన ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు.
27
అత్యంత కాస్ట్లీ సినిమా..?
ఎస్ఎస్ రాజమౌళి మరోసారి బాహుబలిని మించిన భారీ స్కేల్ సినిమా 'వారణాసి' నిర్మాణంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. ఇది ఇప్పటివరకు వచ్చిన భారతీయ చిత్రాలలో అత్యంత ఖరీదైన సినిమాగా ప్రచారంలో ఉంది.
37
త్రేతాయుగంనాటి కథ..
ఈ సినిమాలో కొంత భాగం త్రేతాయుగంలో జరుగుతుందని, అందులో మహేశ్ బాబు ఓ ఫ్లాష్‌బ్యాక్‌లో శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నారని రాజమౌళి కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు రాముడి గెటప్‌లో మహేశ్ ఫస్ట్ లుక్ లీకైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
శనివారం, 'ఆల్వేస్ బాలీవుడ్' అనే X (గతంలో ట్విట్టర్) అకౌంట్ 'వారణాసి' పోస్టర్‌ను షేర్ చేసింది. ఇది సినిమాలో మహేశ్ బాబు రాముడి లుక్ అని పేర్కొంది. 'గుంటూరులోని మైత్రీ సినిమాస్ డిజిటల్ థియేటర్ హోర్డింగ్‌పై #వారణాసి సినిమా నుంచి #మహేశ్‌బాబు రాముడి లుక్ బయటపడింది' అని క్యాప్షన్‌లో రాసింది.
57
మహేష్ బాబు లుక్ ఎలా ఉందంటే?
ఈ వైరల్ పోస్టర్, రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు ఎంత తీవ్రంగా సిద్ధమవుతున్నాడో సూచిస్తోందని ఆ పోస్ట్ సారాంశం. ఈ ఫొటోలో మహేశ్ బాబు ఒక బండరాయిపై నిలబడి, కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు. ఒక చేతిలో విల్లు, మరో చేతిలో రుద్రాక్ష మాల, వీపుపై అమ్ములపొది ఉన్నాయి.
67
మహేష్ బాబు లుక్ ఎక్కడి నుంచి వచ్చింది?
అయితే, ఇది ఎవరో ఫ్యాన్ చేసిన పోస్టర్ అని సోషల్ మీడియా యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే, చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 'వారణాసి' మేకర్స్ ఇంకా మహేశ్ బాబు రాముడి లుక్‌ను విడుదల చేయలేదు. అలాంటప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా ఇలా స్క్రీన్‌పై ప్రత్యక్షమవడం అసాధ్యం.
77
అధికారికంగా ప్రకటించలేదు..
X AI Grok కూడా దీనిపై స్పందించింది. 'ఈ పోస్టర్ గుంటూరులోని మైత్రీ సినిమాస్ హోర్డింగ్ నుంచి లీక్ అయినట్లు చెబుతున్నారు. కానీ, టీమ్ దీన్ని అధికారికంగా విడుదల చేయలేదు. రాజమౌళి.. మహేశ్ బాబు రాముడి పాత్రను ధృవీకరించారు, కానీ ఈ ప్రత్యేక చిత్రాన్ని అధికారికంగా ధృవీకరించలేదు' అని కామెంట్ చేసింది.