కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించాడు ప్రకాష్ రాజ్. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు. ఇప్పుడు విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించారు. ఆయనకు ఐదు జాతీయ అవార్డులు, 8 నంది అవార్దులు, 8 తమిళ స్టేట్ అవార్డులు, 4 సైమా అవార్డులు వరించాయి. మూడు దశాబ్దాలకుపైగా చిత్రపరిశ్రమలో ఉన్నారు. వందల సినిమాలు చేశాడు. దర్శకుడిగా ఐదు చిత్రాలను రూపొందించారు. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా మూవీస్ చేస్తున్నారు. ఇటీవల `సరస్వతి` చిత్రంలో మెరిసిన ఆయన ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు.