రామ్ చరణ్ ‘RC16’ రిలీజ్ డేట్ ఫిక్స్,ఆ స్పెషల్ డేనే?
రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న ‘RC16’ 2026 మార్చి 26న విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ గ్లింప్స్‌ను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.
రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న ‘RC16’ 2026 మార్చి 26న విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ గ్లింప్స్‌ను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.
ఇప్పుడు అందరి దృష్టీ రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న ‘RC16’ పైనే ఉంది. ఇటీవల 'గేమ్ ఛేంజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ ఆ సినిమా తీవ్రంగా నిరాశపరచటంతో తన నెక్ట్స్ ప్రాజెక్టుని త్వరగా తీసుకురావాలనుకంటున్నారు.
గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌తో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ కోసం ఈ ఏడాదిలోనే చరణ్ సినిమాను తీసుకు వస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. మెగా కాంపౌండ్‌లోనూ అదే అభిప్రాయం ఉంది. RC16 సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయడం ద్వారా గేమ్ ఛేంజర్ డ్యామేజ్‌ని తగ్గించాలని భావిస్తున్నారు. అయితే అలా జరిగే అవకాసం ఉందా, RC16 ఎప్పుడు రిలీజ్ కానుంది.
అందుతున్న సమాచారం మేరకు రామ్ చరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మార్చి 27న విడుదల చేయడానికి టీమ్ టీజర్ గ్లింప్స్‌ను కూడా సిద్ధం చేస్తోంది. . ఈ టీజర్ గ్లింప్స్‌తో పాటు విడుదల తేదీని కూడా ఈ చిత్ర మేకర్స్ ప్రకటించనున్నారు. #RC16 చిత్రం 26 మార్చి 2026న రామ్ చరణ్ పుట్టినరోజుకి ఒక రోజు ముందు థియేటర్లలోకి రానుంది.
ఈ వార్త అభిమానులకు డబుల్ ట్రీట్. రామ్ చరణ్ తదుపరి పుట్టినరోజున సినిమా థియేటర్లలోకి వస్తుందని అభిమానులకు తెలియజేస్తూ ఆయన పుట్టినరోజున విడుదల తేదీని ప్రకటిస్తారు.
ప్రస్తుతం ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. రూరల్ బ్యాగ్రౌండ్ స్టోరీతో రూపొందతున్న ఈమూవీలో రామ్ చరణ్ స్పోర్ట్స్ మెన్ గా కనిపిస్తారట. టాలీవుడ్ సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఇందులో క్రికెటర్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక RC16 సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి.
ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న విషయం తెల్సిందే. స్పోర్ట్స్ డ్రామాగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది.