tuk tuk movie review
Tuk Tuk Movie Review: ఇటీవల `కోర్ట్` సినిమాతో ఆకట్టుకున్నాడు హర్ష్ రోషన్. ఓ రకంగా తాను హీరోగా మారిపోయాడని చెప్పొచ్చు. అయితే అంతకు ముందే ఆయన ప్రధాన పాత్రలో నటించిన మూవీ `టుక్ టుక్`. సుప్రీత్ సి క్రిష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నిహాల్ కోదాటి, శాన్వి మేఘన జంటగా నటించారు.
హర్ష్ రోషన్‌తోపాటు కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, దయానంద్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. చిత్రవాహిని ప్రొడక్షన్స్, ఆర్‌వైజీ సినిమాస్ పతాకాలపై రాహుల్ రెడ్డి డి, లొక్కు శ్రీ వరుణ్, సి శ్రీరాములు రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 21 శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
tuk tuk movie review
కథః
రాయలసీమకు చెందిన ఓ గ్రామంలో జరిగే కథ ఇది. ముగ్గురు కుర్రాళ్లు(హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు)లకు ఆడవాళ్లు స్నానం చేస్తుంటే చూసే పరమ చెడ్డ అలవాటు ఉంటుంది. ఎవరికి దొరక్కుండా ఆ పని చేస్తుంటారు. దీన్ని ఓ కుర్రాడు(హర్ష్ రోషన్) వ్యతిరేకిస్తాడు. కానీ మిగిలిన ఇద్దరు దానిపై మోజు చూపిస్తుంటారు. బెవార్స్ గా తిరిగే వీరికి ఇలా వీడియోలు తీసి అమ్ముకోవాలనుకునే ఆలోచన వస్తుంది. కెమెరా కొనడానికి డబ్బులు అడిగితే ఎవరూ ఇవ్వరు. వినాయకుడిని పెడితే చందాలు వస్తాయి.
దానితో కెమెరా కొనుక్కోవచ్చు అని ప్లాన్ చేస్తారు. వినాయకుడికి బాగానే చందాలు వస్తాయి. గణేషుడిని ఊరేగించడానికి బండి కావాల్సి వస్తుంది. ఊర్లో పెద్దమనిషిని కాదని వినాయకుడిని పెట్టడంతో ఆయన నో చెబుతాడని భావించి, పడాబడ్డ స్కూటర్‌ని రిపేర్ చేయించి ఆటోలా తయారు చేస్తారు. దాని మీదనే వినాయకుడిని ఊరేగించి నిమజ్ఞనం చేస్తారు. కానీ అప్పట్నుంచి ఆ ఆటోలో కదలికలు గమనిస్తారు. మార్నింగ్ అవగానే అది సూర్యూడి వైపు తిరుగుతుంది. అది ఊరందరిని ఆశ్చర్యపరుస్తుంది.
అంతేకాదు ఏదైనా కోరికలు కోరుకుంటే అది అవుతుందో లేదో చెబుతుంది. దీంతో అంతా ఆ ఆటోని దేవుడిలా చూస్తుంటారు. క్రమంగా అందులో ఉన్నది దేవుడు కాదు, దెయ్యం అని తెలుసుకుంటారు ఈ ముగ్గురు కుర్రాళ్లు. అందులో ఉన్నది ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో ఒక రోజు ఆ ఆటో శిల్ప(శాన్వి మేఘన) అనే అమ్మాయి ఇంటికి తీసుకెళ్తుంది. కానీ ఆ ఇంట్లో శిల్ప లేదు.
ఆమె చాలా రోజుల క్రితమే ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. ఎక్కడికెళ్లిందో తెలియదు. ఆ విషయం తెలుసుకునేందుకు శిల్ప స్నేహితులను కలుస్తారు ఈ ముగ్గురు. మరి ఆమె ఫ్రెండ్స్ చెప్పిన శిల్ప కథేంటి? ఆమె ప్రేమించినది ఎవరిని? తను చనిపోయిందా? బతికే ఉందా? ఆటోలో ఉన్నది ఎవరు? శిల్పకి ఆ ఊర్లో జరిగిన అవమానం ఏంటి? ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది. చివరకు ఏం జరిగిందనేది మిగిలిన కథ.
tuk tuk movie review
విశ్లేషణః
`టుక్ టుక్` ఒక స్కూటర్, ఒక అమ్మాయి, ఆమె ప్రేమ కథ, ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ల జర్నీని తెలియజేసే మూవీ. ఈ మూడింటికి ఉన్న సంబంధమే ఈ చిత్రం. ఫన్నీగా ప్రారంభమై, దైవత్వం అనే టచ్ ఇస్తూ, హర్రర్ ఎలిమెంట్లు జోడిస్తూ లవ్ అండ్ ఎమోషనల్ జర్నీగా ఈ మూవీ సాగుతుంది. ఎమోషనల్‌గానే ముగుస్తుంది.
కథ పరంగా చాలా భిన్నమైన స్టోరీ ఇది. కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే కూడా. దాన్ని నడిపించిన తీరు బాగుంది. ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తూ కథలోకి ఇన్‌వాల్వ్ చేసిన తీరు అదిరిపోయింది. సరదాగా సాగే కథని సీరియస్‌గా మార్చి, హర్రర్ ఎలిమెంట్లని జోడించి, ఆ తర్వాత ప్రేమ కథగా మార్చి, ఎమోషనల్‌గా ముగించిన తీరు బాగుంది.
ఇక్కడే దర్శకుడి ప్రతిభ ఏంటో తెలిసిపోతుంది. ఆయన ఎంత ఇన్నోవేటివ్‌గా ఆలోచించాడనేది అర్థమవుతుంది. అయితే కథ పరంగా మరింత క్లారిటీ మెయింటేన్ చేయాల్సింది. కథనే కన్విన్సింగ్‌గా లేదు. శిల్ప అనే అమ్మాయి జర్నీలో చాలా సస్పెన్స్ లు ఉంటాయి. ఆమె ఎలా చనిపోయింది? ఎందుకు చనిపోయిందనే విషయాలు చెప్పిన తీరు కన్విన్సింగ్‌గా లేవు. అసల క్లారిటీ లేదు. అదే సమయంలో క్లైమాక్స్ కూడా ఇంకా బాగా డీల్ చేయాల్సింది.
tuk tuk movie review
సినిమా ఫస్టాఫ్ చాలా సరదాగా వెళ్తుంది. ముగ్గురు కుర్రాళ్ల మీదనే కథ నడుస్తుంది. ఆ తర్వాత ఆటో యాడ్ అవుతుంది. ఆటో వీరిని నడిపిస్తుంది. డబ్బులు తెచ్చిపెడుతుంది. చివరికి తప్పులు చేస్తే కూడా హెచ్చరిస్తుంది. ఓ రకంగా ఆటోకి కూడా ప్రాణం ఉందనేలా చూపించిన తీరు బాగుంది. అదే ఇందులో కొత్త పాయింట్. దాన్ని అంతే ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు.
హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్ తోపాటు మరో కుర్రాడు చేసే పనులు నవ్వులు పూయించేలా ఉంటాయి. మరికొంత నీచంగానే ఉంటాయి. ఈ ముగ్గురు కూడా సీరియస్ గా వెళ్తున్న కథలో కామెడీని పండించే ప్రయత్నం చేయడం అభినందనీయం. ఇక సెకండాఫ్‌లో కథ మొత్తం శిల్ప, నవీన్‌ల చుట్టూ తిరుగుతుంది. వారి లవ్ స్టోరీ తెలియజేస్తుంది.
కానీ ఇందులో పలు సస్పెన్స్ అంశాలు మిస్టరీగా ఉంటాయి. అయితే ఇందులో ఒక అమ్మాయికి స్వేచ్ఛ అనే పాయింట్‌ని డిస్కస్ చేసిన తీరు బాగుంది. భూమి, ఆకాశం, గాలి, చెట్లు మాదిరిగానే మనం కూడా ఇందులో భాగమే అని, దానికి ఎవరూ అతీతం కాదని చెప్పిన పాయింట్ బాగుంది. ఆలోచింప చేస్తుంది. అయితే సినిమా ప్రారంభం నుంచి కొంత సస్పెన్స్ తో సాగుతుంది.
స్లోగా సాగడం కూడా కొంత బోరింగ్ అనిపిస్తుంది. కామెడీ బాగా చేయాల్సింది. ఆ డోస్ తగ్గింది. బాత్ రూమ్ సీన్లు క్రేజీగా ఉంటాయి. దీనికితోడు ఇందులో `థ్యాంక్స్` అనే పాయింట్‌ని డిస్కస్ చేశారు. అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది. దాని వెనక కథేంటనేది సస్పెన్స్, ఆ క్లారిటీనే మిస్ అయ్యింది. అదే సమయంలో ఇందులో బలమైన ఎమోషన్స్ మిస్ అయ్యాయి. వాటిపై దర్శకుడు మరింత ఫోకస్ పెట్టాల్సింది.
tuk tuk movie review
నటీనటులుః
ముగ్గురు కుర్రాళ్లుగా హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీఫెన్ మధు ముగ్గురు కుర్రాళ్లు అదరగొట్టారు. ఫన్, ఇన్నోసెంట్, చిలిపి పనులతో నవ్వించారు. క్రేజీగా ప్రవర్తించి షాకిచ్చారు. తమదైన నటనతో మెప్పించారు. అందరి దృష్టి తమవైపు తిప్పుకున్నారు. ఫస్టాఫ్ మొత్తాన్ని ఈ ముగ్గురే నడిపించారు.
సెకండాఫ్‌లో కూడా మేజర్‌గా వీళ్లదే ఉంటుంది. శిల్ప పాత్రలో శాన్వి అదరగొట్టింది. అల్లరి పిల్లగా మెప్పించింది. నవీన్ పాత్రలో నిహాల్ కోదాటి ఆకట్టుకున్నారు. కాసేపు మెరిసినా మ్యాజిక్ చేశాడు. దయానంద్ రెడ్డి ఉన్నంతలో బాగానే చేశాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
tuk tuk movie review
టెక్నీషియన్లుః
సినిమాకి కార్తిక్ సాయికుమార్ కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా తీశారు. కలర్ ఫుల్‌గా ఉంది. అశ్వత్ శివకుమార్ ఎడిటింగ్ ఫర్వాలేదు. కొంత కట్ చేయోచ్చు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ శాంతు ఓంకార్ మ్యూజిక్, ఆర్‌ఆర్ బాగుంది. సినిమాకి హైలైట్‌గా నిలిచింది. కెమెరా వర్క్, మ్యూజిక్ సినిమాకి పెద్ద అసెట్‌గా చెప్పొచ్చు.
నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు సుప్రీత్ కృష్ణ ఎంచుకున్న కథ కొత్తగా ఉంది. కానీ దాన్ని మరింత ఇంట్రెస్టింగ్‌గా నడిపించాల్సింది. చెప్పాలనుకున్న విసయం క్లారిటీగా, బలంగా చెప్పాల్సింది. బలమైన ఎమోషన్స్ తో చెబితే బాగుండేది. ఆడవాళ్లకి స్వేచ్ఛ అనే పాయింట్‌ని కొత్తగా చూపించారు. ఆ విషయంలో మరింత క్లారిటీ మెయింటేన్ చేయాల్సింది.
ఫైనల్‌గాః `టుక్ టుక్` నవ్విస్తూ ఎంగేజ్ చేసే సస్పెన్స్ థ్రిల్లర్.
రేటింగ్‌ః 2.75