సిల్వర్‌ కలర్‌ శారీలో బాలయ్య భామ హోయలు.. లిక్కర్‌ ప్రమోషన్‌ కోసం చిలిపిగా కవ్వింపులు..

Published : May 28, 2022, 05:16 PM ISTUpdated : May 28, 2022, 05:39 PM IST

బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్‌ గ్లామర్‌ షోలో రెచ్చిపోతుంది. `అఖండ` ఇచ్చిన జోష్‌లో అందాల విందుకి తెరలేపింది. లేటెస్ట్ గా ఆమె ఓ లిక్కర్‌ బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం గ్లామర్‌ షో చేసింది. 

PREV
18
సిల్వర్‌ కలర్‌ శారీలో బాలయ్య భామ హోయలు.. లిక్కర్‌ ప్రమోషన్‌ కోసం చిలిపిగా కవ్వింపులు..

హీరోయిన్లు ఈ మధ్య కాలంలో లిక్కర్‌ బ్రాండ్లని ప్రమోట్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని సార్లు వివాదాల్లోనూ ఇరుకుంటున్నారు అభిమానుల చేత విమర్శలెదుర్కొంటున్నారు. ఆ మధ్య ఓ ఆల్కహాల్‌ బ్రాండ్‌ని ప్రమోట్‌ చేస్తూ వార్తల్లో నిలిచింది ప్రగ్యా జైశ్వాల్‌(Pragya Jaiswal). 
 

28

తాజాగా ప్రగ్యా జైశ్వాల్‌  `బ్లెండర్స్ ప్రైడ్‌` బ్రాండ్‌ ప్రమోషన్‌లో పాల్గొంది. ఈ లిక్కర్‌ ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్‌ నైట్‌లో పాల్గొంది ప్రగ్యా. సిల్వర్‌ కలర్‌ శారీ ధరించి హోయలు పోయింది. చీరలోనూ యమ సెక్సీగా కనిపిస్తూ కనువిందు చేసింది. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలోవైరల్‌ అవుతున్నాయి. 
 

38

ఇదిలా ఉంటే ప్రగ్యా జైశ్వాల్‌ ఇలా లిక్కర్‌ ప్రమోషన్‌లో పాల్గొనడంపై ఆమె అభిమానుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మహిళా సాధికారతకు నిదర్శనంగా చెబుతున్నారు. మరోవైపు సభ్య సమాజానికి ఎలాంటి సందేశం అందిస్తున్నట్టు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఏదేమైనా గతంలో వచ్చినంతగా ఆమెపై విమర్శలు రాకపోవడం విశేషం.

48

`అఖండ` చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది ప్రగ్యాజైశ్వాల్‌. ఈసినిమా ఇచ్చిన ఉత్సాహంతో దూసుకుపోతుంది. అయితే ఇప్పటి వరకు కొత్త సినిమాలు ప్రకటించకపోయినా, ఇతర కార్యక్రమాల్లో మాత్రం ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారుతుంది. 
 

58

ఇక గ్లామర్‌ పరంగానూ దూకుడు పెంచింది ప్రగ్యా జైశ్వాల్‌ వరుసగా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ కనువిందు చేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నిత్యం ఏదో రూపంలో ఆమె అభిమానులకు, నెటిజన్లకి టచ్‌లో ఉండటం విశేషం. 
 

68

ప్రగ్యాజైశ్వాల్‌ `అఖండ`కి ముందు కెరీర్‌ చాలా స్ట్రగులింగ్‌లో సాగుతుంది. ఇలాంటి క్రమంలో బోయపాటి శ్రీను, బాలయ్య ఆమెకి మంచి బ్రేక్‌ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ చిత్రంలో కలెక్టర్‌గా ఆమె అద్బుతమైన నటనని ప్రదర్శించింది. తెలంగాణ అమ్మాయిగా అలరించింది, బాలయ్యతో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. 

78

అయితే ఈ సినిమా వచ్చి ఆరు నెలలైనా ఇంకా ప్రత్యా కొత్త సినిమా ప్రకటించకపోవడం గమనార్హం. ఆమెకి అవకాశాలు రావడంలేదా? లేక మంచి ఆఫర్ల్ కోసం వేచి చూస్తుందా? అనేది సస్పెన్స్ గా మారింది. `అఖండ`తో వచ్చిన సక్సెస్‌ని అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతుందా? అనేది కన్‌ఫ్యూజన్‌గా మారింది. 
 

88

ఏదేమైనా ప్రగ్యా జైశ్వాల్‌ కెరీర్‌ మళ్లీ మొదటికొచ్చిన ఫీలింగ్‌ కలగడం గమనార్హం. మరి తన కెరీర్‌ని ప్రగ్యా ఎలా మలుచుకుంటుందనేది చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories