చాలా కాలం తర్వాత ఇలియానా ఆనందంగా కనిపించింది. లేటెస్ట్ ఫోటో షూట్ లో ఇలియానా ముఖం వెలిగిపోగా అందం రెట్టింపు అయ్యింది. ఇలియానా సంతోషం వెనుక కారణం ఏమిటనే ప్రశ్న మొదలైంది.
ఫార్మ్ కోల్పోతే ఫేమ్ పోతుంది. పట్టించుకునే నాథుడే ఉండడు. ఇలియానా (Ileana D Cruz) తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఆమె కెరీర్ ని పాతాళంలో పడేశాయి. సౌత్ లో స్టార్ గా వెలిగిపోతున్న టైం లో నార్త్ పై కన్నేసి అసలుకే ఎసరు తెచ్చుకుంది.
28
Ileana Latest Photos
2012లో విడుదలైన హిందీ చిత్రం బర్ఫీ. రన్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రలు చేశారు. క్రిటిక్స్ మెప్పు పొందిన బర్ఫీ కమర్షియల్ గా ఆడలేదు. మానసిక రోగి పాత్ర చేసిన ప్రియాంక మార్కులు కొట్టేసింది. బర్ఫీ మూవీతో ఇలియానా బాలీవుడ్ కి పరిచయమయ్యారు.
38
Ileana Latest Photos
బాలీవుడ్ కి వెళ్ళాక ఇలియానా కెరీర్ ఇచ్చిన టాలీవుడ్ ని పట్టించుకోలేదు. ఇక్కడ స్టార్ హీరోల చిత్రాలు కాదని అక్కడ టూ టైర్ హీరోల చిత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఆమె నటించిన ఒక్క హిందీ చిత్రం కూడా చెప్పుకోదగ్గ విజయం అందుకోలేదు. ఈ లోగా సౌత్ ప్రేక్షకులు ఆమెను మర్చిపోయారు.
48
Ileana Latest Photos
ప్రేమ వ్యవహారం కూడా ఇలియానా ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ తో ఇలియానా కొన్నాళ్ల పాటు రిలేషన్ నడిపారు. ఆండ్రూ 2019లో ఇలియానాకు బ్రేకప్ చెప్పాడు. ఈ పరిణామం ఆమెను మానసిక వేదనకు గురి చేసింది. కెరీర్ వదిలేసి బరువు పెరిగింది. నాజూకు నడుము ఇలియానా గుర్తు పట్టలేనంతగా లావయ్యారు.
58
Ileana Latest Photos
ఆ డిప్రెషన్ నుండి బయటపడిన ఇలియానా కెరీర్ పై ఫోకస్ పెట్టారు. అడపాదడపా అవకాశాలు వస్తుండగా, కాదనకుండా చేస్తున్నారు. ముంబైలో సెటిల్ అయిన ఇలియానా బాలీవుడ్ నే నమ్ముకుని కెరీర్ సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అన్ ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంతో పాటు మరో మూవీ చేస్తున్నారు.
68
Ileana Latest Photos
ఎప్పటికైనా బ్రేక్ వస్తుందనే ఆశతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇలియానా కెరీర్ లో పోకిరి, జల్సా, కిక్, జులాయి వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. ఓ దశాబ్దం వరకు ఆమె టాలీవుడ్ కలల రాణిగా వెలుగొందారు.
78
Ileana Latest Photos
చాలా కాలం తర్వాత ఇలియానా ఆనందంగా కనిపించింది. లేటెస్ట్ ఫోటో షూట్ లో ఇలియానా ముఖం వెలిగిపోగా అందం రెట్టింపు అయ్యింది. ఇలియానా సంతోషం వెనుక కారణం ఏమిటనే ప్రశ్న మొదలైంది.
88
Ileana Latest Photos
చాలా కాలం తర్వాత ఇలియానా ఆనందంగా కనిపించింది. లేటెస్ట్ ఫోటో షూట్ లో ఇలియానా ముఖం వెలిగిపోగా అందం రెట్టింపు అయ్యింది. ఇలియానా సంతోషం వెనుక కారణం ఏమిటనే ప్రశ్న మొదలైంది.