
ప్రగ్యా జైశ్వాల్ ఇప్పుడు ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఆమె బ్లూ డ్రెస్ లో మెరిసింది. బ్లూ లెహంగా ఓణిలో హోయలు పోయింది. ర్యాంప్‌పై వాక్ చేస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. తన ఘాటు రేపే అందాలకు ట్రెండీ వేర్ తోడు కావడంతో ప్రగ్యా అందాలు మరింత ఓవర్ లోడ్ కావడం విశేషం.
తాజాగా ఈ బ్యూటీ `టీచ్ ఫర్ ఛేంజ్` సంస్థ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌లో పాల్గొంది.అందులో భాగంగా ప్రగ్యా అందంగా వాక్ చేసింది. అందాల విందు చేస్తూ హోయలు పోయింది. బ్రాని తలపించే బ్లౌజ్‌లో పరువాల విందు చేస్తూ ఆడియెన్స్ మతిపోగొట్టింది. స్పాన్సర్లని ఫిదా చేసింది. ఫండ్ రైజింగ్‌లో తనుభాగమైంది.
హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్‌లో ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం జరిగింది. ఇందులో టాలీవుడ్ తారలంతా పాల్గొన్నారు. ప్రగ్యా జైశ్వాల్‌తోపాటు రకుల్, హేబా పటేల్, మంచు లక్ష్మి, శివాత్మిక, శివానీ, ఫరియా అబ్దుల్లా తోపాటు మరికొందరు కథానాయికలు, నవదీప్, త్రిగుణ్, యాంకర్ ప్రదీప్ వంటి వారు పాల్గొన్నారు. టీవీ ఆర్టిస్టులు, మోడల్స్ పాల్గొని సందడి చేశారు.
వీరిలో ప్రగ్యా జైశ్వాల్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవడం విశేషం. ఆమె కవ్వించే పోజులతో మెస్మరైజ్ చేసింది. చిలిపి నవ్వులతో ఫిదా చేసింది, మత్తెక్కించే పోజులతో మతిపోగొట్టింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్‌నిస్తున్నాయి.
తొమ్మిదేళ్ల క్రితం(2014)లో `డేగ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా జైశ్వాల్. కానీ ఆమెకి పెద్దగా పేరు రాలేదు. సినిమా ఆడలేదు. ఆ తర్వాత `మిర్చి లాంటి కుర్రాడు` అనే మరో చిన్న సినిమా చేసింది. ఈ చిత్రంతో కాస్త పేర్కొచ్చింది. ఈ క్రమంలోనే `కంచె`లో నటించే ఛాన్స్ అందుకుంది.
క్రిష్ దర్శకత్వంలో రూపొందిన `కంచె` చిత్రం పెద్ద హిట్ అయ్యింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈసినిమా ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుని అందుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది ప్రగ్యా. ఆమె హుందాగా నటించి మెప్పించింది. రాజకుమారి సీతాదేవి పాత్రలో అబ్బురపరిచింది.
ఇక ఈ సినిమాతో ప్రగ్యా స్టార్ హీరోయిన్‌గా మారిపోతుందని, స్టార్లతో అవకాశాలు వస్తాయని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఆ తర్వాత చేసిన `ఓం నమో వెంకటేశాయ`, `గుంటూరోడు` చిత్రాలు బోల్తా కొట్టాయి. దీంతో ఈ బ్యూటీకి కమర్షియల్ ఆఫర్లు తగ్గిపోయాయి. ఆ టైమ్‌లోనే కృష్ణవంశీ `నక్షత్రం`లో నటించింది. హాట్ ట్రీట్ ఇచ్చింది. కానీ ఏం ప్రయోజనం లేదు. సినిమా డిజాస్టర్. దీంతో సీన్ మొదటికొచ్చింది.
`జయ జానకీ నాయక`లో గెస్ట్ రోల్ లో మెరిసింది. ఆ తర్వాత మంచు విష్ణుతో `ఆచార్య అమెరికా యాత్ర` చేసినా నో సక్సెస్. ఇక ప్రగ్యా పని అయిపోయింది, ఫేడౌట్ అవుతుందనుకునే సమయంలో బాలయ్యతో `అఖండ` చిత్రంలో నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. ఇందులో బాలయ్యకి జోడీగా అదరగొట్టింది. హిట్ కొట్టింది. అయినా ఆమె ఫేట్ మారలేదు. ఇప్పుడు ఆమె చేతిలో నో ఆఫర్స్. యాడ్స్ చేస్తూ, గ్లామర్ ట్రీట్ ఇస్తూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందాల ఫోటోలతో నెటిజన్లని అలరిస్తుంది, కానీ అవకాశాలను మాత్రం రాబట్టుకోలేకపోతుంది. మరి మున్ముందైనా ఛాన్స్ లు వస్తాయా అనేది చూడాలి.