హేబా పటేల్ గ్లామర్ మెరుపులు.. అదిరిపోయే నడక, మతులుపోయే పోజులతో మైండ్ బ్లాక్ చేస్తున్న కుమారి!

First Published | Feb 20, 2023, 6:12 PM IST

యంగ్ హీరోయిన్ హేబా  పటేల్ (Hebah Patel) గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతున్నారు. తాజాగా ఓ ఈవెంట్ లో ర్యాంప్ వాక్ చేసిన ఈ ముద్దుగమ్మ ట్రెడిషనల్ అందాలతో అట్రాక్ట్ చేసింది. ఆ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.  
 

యంగ్ హీరోయిన్ హేబా పటేల్ యూత్ లో మంచి ఫాలోయింగ్ సాధించుకున్న విషయం తెలిసిందే. ‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో క్రేజీ  హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమా తెచ్చి పెట్టిన ఫలితాలతో వరుస ఆఫర్లు అందుకుంది. 

అయితే, హెబా పటేల్ సినిమాల పరంగానే క్రేజ్ దక్కించుకోవడం  కాకుండా.. తన వ్యక్తిగతంగా సోషల్ మీడియాలోనూ సందడి చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఈ  క్రమంలో హేబా పటేల్ ఓ ఈవెంట్ కు హాజరై ఆకట్టుకున్నారు. 
 


హైదరాబాద్ లోని  వెస్టిన్‌ హోటల్‌లో నిర్వహించిన టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ 2023 కార్యక్రమంలో హేబా పటేల్ పాల్గొంది. హేబాతో పాటు సీని తారలు,  రాజకీయ నాయకులు కూడా హాజరై కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. 

ఈవెంట్ కు హాజరైన సందర్భంగా సీని తారలు  ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా యంగ్ బ్యూటీ హేబా పటేల్  కూడా ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. కుమారి వాక్ కు ఈవెంట్ లో మరింత సందడి నెలకొంది. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  
 

ఇక హేబా బ్లాక్ లెహంగా, వోణీలో పద్దతిగా మెరిసింది. ర్యాంప్ పై వాక్ చేస్తూ ఈవెంట్లోని అందరి చూపు తనపైనే పడేలా చేసింది. సంప్రదాయ దుస్తుల్లో హేబా మరింతగా మెరిసిపోతోంది. మరోవైపు గ్లామర్ విందుతోనూ కట్టపడేసింది.

అదిరిపోయే నడకతో పాటు మతులుపోయే పోజులతో కుమారి కట్టిపడేసింది. టాప్ టు బాటమ్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు మత్తు చూపులతో మైకం తెప్పించేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

మొత్తానికి యంగ్ బ్యూటీ ఇలా మెరిసి ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. మరోవైపు ఫ్యాన్స్ కు సోషల్  మీడియాలో హెబా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంటారు. సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. 
 

ప్రస్తుతం హేమా సినిమాల విషయంలో కాస్తా రూటు మార్చుకుంది. లేడీ ఓరియెంట్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తున్నారు. చివరిగా ‘ఓదెల రైల్వే స్టేషన్’తో ఆకట్టుకుంది. ప్రస్తుతం... తమిళంలో రూపుదిద్దుకుంటున్న ‘వల్లన్’,‘ఆద్య’, తెలుగులో ‘శాసనసభ, తెలిసినవాళ్లు, గీత’ వంటి చిత్రల్లో నటిస్తున్నారు. 
 

Latest Videos

click me!