బాలీవుడ్ లో వరుస సినిమాలతో తిరుగు లేని ఇమేజ్ సాధించింది కృతీ సనన్. చాలా తక్కువ టైమ్ లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసే స్టేజ్ కు వచ్చిన కృతీ.. అటు సోషల్ మీడియాలో కూడా తన సత్తా చాటుకుంటుంది.
కృతీ సనన్ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో వన్ నేనొక్కడినే సినిమాతో అటు ఇండస్ట్రీ ఎంట్రీ.. ఇటు టాలీవుడ్ ఎంట్రీ రెండూ ఒకేసారి ఇచ్చింద. ఫస్ట్ సినిమానే సూపర్ స్టార్ మహేష్ జంటగా చేసిన ఈ బ్యూటీ.. ఆతరువాత బాలీవుడ్ కే పరిమితం అయ్యింది.
27
చిన్న చిన్నగా తన ఇమేజ్ పెంచుకుంటూ పోయిన కృతీ సనన్..బాలీవుడ్ స్టార్ హీరోల సరసన చేరింది. తన టాలెంట్ తో పాటు బ్యూటీతో బీటౌన్ ఆడియన్స్ ను .. ఫిల్మ్ మేకర్స్ ను పడేసిన కృతీ సనన్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లి పోయింది.
37
సోషల్ మిడియాలో కృతీ అందాలకు ఫిదా అవ్వని వారు ఉండరు. కృతీ సనన్ వయ్యారాలకు ముగ్ధులై.. ఆమె ఫాలోవర్స్ గా మారుతున్నారు ప్రేక్షకులు. ఎప్పటికప్పుడు సోకుల సునామీలో నెటిజన్లను తడిపి ముద్ద చేస్తుంది కృతీ. అందుకే ఆమె కు ఎప్పటికప్పుడు పాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారు.
47
అటు సినిమాలు చేసుకుంటూనే ఇటు సోషల్ మీడియాలో తన ఇమేజ్ ను, ఫాలోవర్స్ ను పెంచుకుంటూ వస్తోంది కృతీ సనన్. ఇప్పటికీ ఇన్ స్టాలో దాదాపు 4 కోట్ల 60 లక్షలకు పైగా ఫాలోవర్స్ తో.. తన ఫాలోయింగ్ ను.. సత్తాను చాటుకుంటుంది కృతీ సనన్.
57
ప్రస్తుతం కృతీ సనన్ స్టార్ హీరోలతో వరుస సినిమాలు లైన్ లో పెట్టింది. అక్షయ్ కుమార్ తో కృతీ సనన్ నటించిన బాలీవుడ్ మూవీ బచ్చన్ పాండే మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. మార్చ్ 18న ఈ మూవీ థియేటర్లను పలకరించబోతోంది.
67
ఇటు యూనివర్సల్ స్టార్ ప్రభాస్ తో కూడా కృతీ సనన్ సినిమా చేస్తోంది. బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రభాస్ ఆదిపురుష్ లో కృతీ సనన్ సీతగా నటిస్తోంది. రాముడిగా ప్రభాస్ అలరించబోతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ నడుస్తోంది.
77
ఇలా కృతీ సనన్ అటు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు.. ఇటు సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్స్ లో దూసుకుపోతోంది. హాట్ హాట్ లుక్స్ తో అదరగొడుతూ.. అందాల విందు చేస్తుంది. ఫాలోయింగ్ ను ఇంకా పెంచుకుంటోంది.