మహేష్ - పవన్ కొడుకులతో మల్టీస్టారర్, ప్లాన్ చేస్తున్నగురూజీ.. వర్కౌట్ అయ్యేనా..?

First Published | Oct 29, 2024, 3:00 PM IST

టాలీవుడ్ నుంచి ఓ క్రేజీ మల్టీస్టారర్ కు రంగం సిధ్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఈ సినిమాకు దర్శకుడు ఎవరు..? వార్తల్లో నిజం ఎంత..? 

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి కవరకూ.. ఎన్నో క్రేజీమల్టీ స్టారర్స్.. ఆడియన్స్ ను అలరించాయి. మరికొన్ని సినిమాలు అభిమానులకు సర్ ప్రైజ్ లు ఇచ్చాయి. స్టార్స్ కు సంబంధించిన క్రేజీ మల్టీ స్టారర్స్ ఎన్నో మిగిలిపోయి ఉన్నాయి. ఈక్రమంలో దర్శకులు వాటిని బయటు తీసే పనిలో ఉన్నారు. 

Also Read: 300 కోట్ల రెమ్యునరేషన్ తో దళపతి విజయ్‌ను అధిగమించిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?
 

pawan kalyan mahesh babu

ఆర్ఆర్ఆర్ తరువాత పెద్దగా మల్టీ స్టారర్స్ రాలేదు.కాని ఎవరూ ఊహించని కాంబినేషన్ లో మల్టీ స్టారర్ ప్లానింగ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇంకీ ఆ ఊహించని కాబినేషన్ ఎంటో తెలుసా..? ఇంతకీ ఆ క్రేజీ మల్టీ స్టారర్ ఏంటో తెలుసా.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అది బాక్సాఫీస్ రికార్డ్ లను బ్లాస్ట్ చేసి.. ఇండస్ట్రీని షేక్ చేస్తాయి. 

కాని ఇది జరిగే పరిస్థితి ఇప్పట్లో లేదు కాని... వీరి వారసులతో మాత్రం మల్టీ స్టారర్  సినిమా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇటు పవన్ కాని.... అటు మహేష్ బాబు కాని మల్టీ స్టారర్స్ చేసినవారే విచిత్రం ఏంటంటే..ఈ ఇద్దరు హీరోలు ఒకే హీరోతో కలిసి విడివిడిగా మల్టీ స్టారర్ మూవీస్ చేశారు. ఆయన ఎవరో కాదు విక్టరీ వెంకటేష్.

Also Read:  Jr NTR ఊతపదం ఏంటో తెలుసా


 అవును మహేష్ బాబేమో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. పవన్ కళ్యాణ్ ఏమో గోపాల గోపాల సినిమాలు చేశారు. అయితే పవన్, మహేష్ కలిసి సినిమా అంటే అది ఊహకు అందదు. అందుకే పవన్ కొడుకు అఖీరా నందన్, మహేష్ బాబు కొడుకు గౌతమ్ కాంబోలో సినిమాను చేయాలని అనుకుంటున్నారట. ఇక  అకిరా నందన్,  గౌతమ్ కృష్ణలు తొందర్లోనే హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారని తెలుస్తోంది.  

Also Read:  యష్మీపై గౌతమ్ ప్రతీకారం.. ఐలవ్ యూ అన్న నోటితోనే అక్కా అంటూ నరకం చూపిస్తున్న డాక్టర్ బాబు

అటు అకీరా ఇప్పటికే ప్రాక్టీస్ అయిపోయాడు కూడా.. యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవడమే మిగిలుంది. ఇక గౌతమ్ కృష్ణ ప్రస్తుతం ఫారెన్ లో చదువుకుంటున్నాడు. అతను కూడా చదువు అయిపోయిన వెంటనేరంగంలోకి దిగే అవకాశం ఉంది.  ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరు హీరోలను పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలని చూస్తున్నారట. 

Also Read:  నయనతారకు నిజంగా 40 ఏళ్ళా..?

ఇక ఒకే సినిమాతో వాళ్ళిద్దరిని లాంచ్ చేయాలని ఒక స్టార్ డైరెక్టర్ అనుకుంటున్నాడట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ విసయంలో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కాని.. త్రివిక్రమ్ వీళ్లిద్దరిని పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేసి ఇద్దరిని ఒకేసారి లాంచ్ చేయాలని చూస్తున్నాడట. 
 

allu arjun, trivikram srinivas, pan india movie

ఇక త్రివిక్రమ్ ఇద్దరికీ చాలా మంచి సన్నిహితుడే కాబట్టి అతను అనుకుంటే అవుద్ది అని మరి కొంతమంది అంటున్నారు. మరి ఇది సాధ్యం అయ్యే పనేనా.. లేక రూమర్స వరకే ఆగిపోతుదా అనేది చూడాలి.  వారసుల ఎంట్రీ పై ఫ్యాన్స్ ఈగర్ గ వెయిట్ చేస్తున్నారు.  ఎప్పుడెప్పుడు వస్తారా.. అని అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. 

ఈక్రమంలో ఇద్దరు ఎంట్రీపై  సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం వీళ్ళిద్దరూ కలిసి ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉంటే.. మహేష్ బాబు రాజమౌళి సినిమాలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. సో ఈ ఇద్దరు ఇప్పట్లో అందే అవకాశం ఏదు కాబట్టి.. ఈప్రాజెక్ట్ నిజంగాస్టార్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. 

Latest Videos

click me!