మీరు చెప్తే నోరు మూసుకుని చేస్తానంటూ ప్రభాస్ , ఆ ఒక్క మాటా చాలు

First Published | Sep 26, 2024, 9:31 AM IST

 ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్ ది. తన తోటి హీరోలు , చిన్న హీరోలు ఎవరి సినిమా ప్రమోషన్ అన్నా మాగ్జిమం హెల్ప్ చేస్తూంటారు. 

Prabhas


ఈ  జనరేషన్ తెలుగు హీరోలకు ప్యాన్ ఇండియా మార్కెట్ పరిచయం చేసిన ఘనత ప్రభాస్ దే. అంతేకాదు తెలుగు సినిమా ఖ్యాతిని అంత‌ర్జాతీయ స్థాయిలో చాటిచెప్పిన హీరోల్లో ప్ర‌భాస్ ముందు వ‌రుస‌లో నిలుస్తాడు. తన ఇర‌వై రెండేళ్ల ఏళ్ల సినీ ప్ర‌యాణంలో ఏ తెలుగు హీరోకు సాధ్యం కానీ ఎన్నో రికార్డుల‌ను ప్ర‌భాస్ తిర‌గ‌రాశాడు. తెలుగు రాష్ట్రాల‌కే ప‌రిమిత‌మైన తెలుగు మార్కెట్‌ను బాహుబ‌లి సినిమాతో దేశ‌వ్యాప్తంగా విస్త‌రించిన ఘ‌న‌త ప్ర‌భాస్‌దే. 

తెలుగు సినిమాకు వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించే స‌త్తా ఉంద‌ని బాహుబ‌లి -2తో ప్ర‌భాస్ నిరూపించాడు. సినిమా ఫలితం తో సంబంధం లేకుండా ప్ర‌భాస్ సినిమా అంటే బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్‌లు క్రియేట్ చేయ‌డం కామ‌న్‌ అయ్యిపోయింది. అయితే అదే సమయంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్ ది.

తన తోటి హీరోలు , చిన్న హీరోలు ఎవరి సినిమా ప్రమోషన్ అన్నా మాగ్జిమం హెల్ప్ చేస్తూంటారు. అలాగే సీనియర్స్ కు ప్రబాస్ ఇచ్చే గౌరవం మామూలుగా ఉండదు. ఆ విషయం సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావుగారితో మాట్లాడుతున్నప్పుడు మరోసారి బయిటకు వచ్చింది.
 



ఒక షోలో భాగంగా దర్శకేంద్రులు  రాఘవేంద్ర రావు గారు ప్రభాస్ గారిని మీ బాడీ లాంగ్వేజ్ భక్తిరస పాత్రలకి కరెక్ట్ గా సూట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఒకవేళ అవకాశం వస్తే మీతో తప్పకుండా ఒక భక్తి రస పాత్రతో సినిమా చేస్తానని రాఘవేంద్ర రావు అన్నారు. 

దానికి వెంటనే  ప్రభాస్ కూడా మీరు చెప్తే నోరు మూసుకుని ఆ సినిమా చేస్తాను అనటం జరిగింది.   వీరి కాంబినేషన్లో ఒక భక్తి రసం చిత్రం  వచ్చే అవకాసం తక్కువే ఉంది కానీ ప్రబాస్ పెద్దల పట్ల చూపించే గౌరవం, వినయం మాత్రం చెప్పుకోదగ్గది. ఈ విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు  పాత వీడియోను షేర్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. 
 

The Raja Saab Prabhas film update out

 ప్రస్తుతం ‘రెబల్ స్టార్’ ప్రభాస్ స్పీడ్‌ను మరే హీరో కూడా అందుకోవడం కష్టమన్నట్లు దూసుకుపోతున్నారు. నాలుగైదు పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలు లైన్లో పెట్టిన డార్లింగ్.. ఒకేసారి మూడు సినిమాల షూటింట్‌లలో పాల్గొంటున్నారు. ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో ‘సలార్ 2’ షూటింగ్‌కు కాస్త టైం పట్టేలా ఉంది

కానీ.. మిగతా సినిమాలు మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్‌’ సెట్‌లో ఉన్నారు. ముందుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. హను రాఘవపూడి ప్రాజెక్ట్‌లో జాయిన్ అవనున్నారు. అందుకే వీలైనంత త్వరగా మారుతిని రాజాసాబ్ పూర్తి చేయాలని చెప్పాడట.


మరో ప్రక్క రాజాసాబ్ అవకముందే హను రాఘవపూడి మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. తమిళనాడు మధురైలో ఫస్ట్ షెడ్యూల్‌ మొదలైంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌ లేని సన్నివేశాలను హను చిత్రీకరిస్తున్నారు. ఓ వారం రోజుల పాటు ఈ షెడ్యూల్‌ సాగుతుందని సమాచారం. ప్రభాస్ రాజాసాబ్ చిత్ర షూటింగ్ ముగించుకుని ‘ఫౌజీ’లో జాయిన్ అవనున్నారు. ఈ సినిమా 1945 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. 
 

కల్కి 2కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయింది. మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్‌తో పాటు గ్రాఫిక్స్ వర్క్‌ని పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే ప్రభాస్ కల్కి2 ని కూడా పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈలోపు నాగ్ అశ్విన్ మిగతా వర్క్ కంప్లీట్ చేసుకోనున్నాడు.  

Latest Videos

click me!