నాని కాదు, నితిన్ కాదు.. మరో యంగ్ హీరోతో క్రేజీ డైరెక్టర్ మూవీ ?

First Published | Sep 26, 2024, 9:01 AM IST

బలగం చిత్రంతో అందరిని ఆశ్చర్యపరిచాడు వేణు ఎల్దండి. అప్పటి వరకు వేణుకి కమెడియన్ అనే గుర్తింపు మాత్రమే ఉండేది. బలగం చిత్రం తర్వాత వేణు క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు.

బలగం చిత్రంతో అందరిని ఆశ్చర్యపరిచాడు వేణు ఎల్దండి. అప్పటి వరకు వేణుకి కమెడియన్ అనే గుర్తింపు మాత్రమే ఉండేది. బలగం చిత్రం తర్వాత వేణు క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. బలగం చిత్రాన్ని విలేజ్ బ్యాక్ డ్రాప్, సహజ సిద్దమైన తెలంగాణ పల్లెటూరి ఎమోషన్స్ పండిస్తూ వేణు చిన్నపాటి అద్భుతమే సృష్టించాడు. 

బలగం తర్వాత వేణు తెరకెక్కించబోయే చిత్రం పై అంచనాలు పెరుగుతున్నాయి. కానీ ఇంతవరకు వేణు నెక్స్ట్ మూవీ ఖరారు కాలేదు. నేచురల్ స్టార్ నానితో ఒక చిత్రం ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. కానీ ఫైనల్ డ్రాఫ్ట్ నానికి నచ్చకపోవడంతో వీరి కాంబినేషన్ రద్దయింది. వేణు, నానిని అఫీషియల్ గా కలసిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. 


ఎల్లమ్మ అనే టైటిల్ తో ఒక చిత్రాన్ని వేణు.. నానికి వినిపించారు. కానీ నాని ఆ కథకి పూర్తి స్థాయిలో ఇంప్రెస్ కాలేదు. దీనితో వేణు ఇదే కథతో యంగ్ హీరో నితిన్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. దిల్ రాజు ఈ ప్రాజెక్టు ఫిక్స్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం నితిన్ దిల్ రాజు బ్యానర్ లోనే తమ్ముడు అనే చిత్రంలో నటిస్తున్నారు. 

ఇంతలోనే మరో క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. నితిన్, వేణు కాంబినేషన్ ఏమైందో తెలియదు కానీ.. హీరో శర్వానంద్.. వేణు దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వేణు చెప్పిన యూత్ ఫుల్ కథకి శర్వానంద్ ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారట. అయితే నాని, నితిన్ ఇద్దరి దగ్గరకి వెళ్లిన కథ.. శర్వానంద్ కి వేణు చెప్పిన కథ రెండూ ఒకటేనా లేక వేరు వేరా అనేది తెలియాల్సి ఉంది. 

Latest Videos

click me!