ఎన్టీఆర్ ‘దేవర’ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే.?

First Published | Sep 26, 2024, 7:53 AM IST

అప్పటినుంచీ   దేవర సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

When will Devara to Hit in OTT ? jsp
#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva, OTT


పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా ఓటిటిలో చూద్దామనుకునే వాళ్లు ఉంటారు.  అందుకు రకరకాల కారణాలు ఉంటాయి. ఈ క్రమంలో పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే దాని ఓటిటి రిలీజ్ డేట్ తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో రేపు భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న దేవర చిత్రం ఓటిటి రిలీజ్ కు ఏం ప్లాన్ చేసారు. ఎప్పుడు ఓటిటిలో రిలీజ్ అవుతోంది అనే విశేషాలు చూద్దాం.

When will Devara to Hit in OTT ? jsp
#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva


అభిమానులు, ప్రేక్షకుల ఎక్సపెక్టేషన్స్ కు  తగినట్లుగానే దేవర మేకింగ్ ఉన్నట్లు ఇప్పటికే రిలీజైన ప్రమోషన్ మెటీరియల్ ని బట్టి అర్దమవుతోంది. రీసెంట్ గా రిలీజైన  దేవర ట్రైలర్స్, సాంగ్స్, గ్లింప్స్ నెక్ట్స్ లెవిల్  లో ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ లో  యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయిందని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో టెర్రిఫిక్‌గా ఉందని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ టిక్కెట్ సేల్స్  ఓ రేంజిలో ఉంటున్నాయి. 


Junior NTR Devara


 దేవర విడుదలకు ముందే రికార్డులు సృష్టించింది. ఇందులోని ‘చుట్టమల్లే..’ పాట సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అత్యంత వేగంగా యూట్యూబ్‌లో 100 మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంది. ‘దేవర’ మూవీలో కొన్ని సీన్స్  కలర్‌ టోన్‌ విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా నైట్‌ ఎఫెక్ట్‌ కోసం అతి తక్కువ వెలుతురులో షాట్స్‌ తీశారు సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌.రత్నవేలు.
ఈ మూవీలో తన పాత్ర కోసం ఎన్టీఆర్‌ 4 భాషల్లో (తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్) డబ్బింగ్‌ చెప్పారు. సైఫ్‌ అలీ ఖాన్‌ పాత్రకు పి.రవిశంకర్‌ గాత్రాన్ని అందించారు.

ఈ విషయాలు పక్కనబెడితే 'దేవర' ఓటీటీ స్ట్రీమింగ్ ఇంట్రస్టింగ్  విషయం బయటకొచ్చింది. 'దేవర' ఓటీటీ హక్కుల్ని ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.155 కోట్లు పెట్టి మరీ అన్ని భాషల హక్కుల్ని కొనుగోలు చేసిందని టాక్. అయితే ఈ సినిమా ఓటిటిలోకి 8 వారాల తర్వాత అంటే రెండు నెలల తర్వాతే వస్తుంది. వెంటనే నెల లోగా రాదు.
 

devara part 1


నార్త్ లో  మల్టీఫ్లెక్స్‌ల్లో సినిమా ప్రదర్శితం కావాలంటే కచ్చితంగా 8 వారాల ఓటీటీ రూల్ పాటించాల్సిందే. 'దేవర' నార్త్ మల్టీఫ్లెక్స్‌ల్లో షోలు పడుతున్నాయి. కాబట్టి దాదాపు 50 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంది.  'హనుమాన్', 'కల్కి' చిత్రాలు ఇలా 8 వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వచ్చాయి.

ఇప్పుడు వీటినే 'దేవర' ఫాలో అయిపోతున్నాడు. దేవర ఓటీటీ రిలీజ్ డేట్ పక్కాగా తెలియదు కానీ, నవంబర్ నెలలోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అది కూడా నవంబర్ నెల మధ్యలో అంటే రెండో వారం లేదా మూడో వారంలో దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ఉంటుంది. 

ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో ప్రీసేల్‌లో అత్యంత వేగంగా మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరిన సినిమాగా ‘దేవర’ నిలిచింది. ట్రైలర్‌ కూడా రిలీజ్‌ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ సినిమా ఇదే కావడం విశేషం. లాస్‌ ఏంజిల్స్‌లో జరుగుతున్న బియాండ్‌ ఫెస్ట్‌లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. అక్కడ ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్‌  షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
 

Latest Videos

click me!