ప్రభాస్, అల్లు అర్జున్ బాక్సాఫీస్ వార్, ఒకే రోజు రిలీజ్ అయిన సినిమాలు, ఎవరు గెలిచారో తెలుసా?

Prabhas vs Allu Arjun: అల్లు అర్జున్, ప్రభాస్ ఇద్దరు బెస్ట్ ప్రెండ్స్, ఇద్దరు పాన్ ఇండియా హీరోలు,  ఈ ఇద్దరు ఓ సారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారని మీకు తెలుసా? ఒకే రోజు రిలీజ్ అయిన ప్రభాస్ బన్నీ సినిమాలు ఏవో తెలుసా? 

Prabhas-Allu Arjun

Prabhas vs Allu Arjun: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్. కాకపోతే ప్రభాస్ కాస్త ముందుగా పాన్ ఇండియాను టచ్ చేస్తే.. ప్రభాస్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ.. రీసెంట్ గా అల్లు అర్జున్ పాన్ ఇండియాపై జెండా పాతాడు. కాగా ఈ ఇద్దరు స్టార్స్ మంచి ఫ్రెండ్స్ కూడా. కాని వీరిద్దరు ఓ సందర్భంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారని మీకు తెలుసా? ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయిన మీకు తెలుసా? 

Also Read:  సాయి పల్లవి ఎనర్జీ సీక్రెట్ ఇదే ? రోజుకు 2 లీటర్లు ఏం తాగుతుందో తెలుసా?

ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు పైన అయ్యింది. హిట్టు ప్లాప్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిన యంగ్ రెబల్ స్టార్ కు.. బాహుబలి సినిమాతో దశ మారిపోయింది. చత్రపతి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ మార్చేసిన రాజమౌళి.. బాహుబలి సినిమాలతో పాన్ఇండియా స్టార్ గా చేశాడు. ఇక అప్పటి నుంచి ప్రభాస్ చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రస్తుతం కూడా దాదాపు అరడజనుకు పైగా పాన్ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు రెబల్ స్టార్.

Also Read:  సికందర్ మూవీ ట్విట్టర్ రివ్యూ, రష్మిక ఖాతలో మరో హిట్ పడ్డట్టేనా?


Allu Arjun Next Film

ఇక అల్లు అర్జున్ ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చిన రెండు మూడేళ్ళతరువాత అడుగు పెట్టాడు. ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అవ్వాల్సింది.. కాని కాస్త లేట్ గా అయినా టార్గెట్ ను గట్టిగా కొట్టేశాడు. సుకుమార్ డైరెక్షన్ లో ఆర్య, ఆర్య2 లాంటి హిట్ సినిమాలు చేసిన బన్నీ.. పుష్ప, పుష్ప2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. జాతీయ అవార్డ్ కూడా సాధించాడు. అంతే కాదు బాహుబలి కలెక్షన్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ.. అనుకున్నదానికన్నా అంతకు మించి సదించాడు బన్నీ. 

ఇక ఈ ఇద్దరు స్టార్లు టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాను శాసిస్తున్నారు. కాగా ఇద్దరు హీరోల సినిమాలో ఒకే రోజు రిలీజ్ అయ్యిపోటీ పడ్డాయిన మీకు తెలుసా? ఈ పోటీలో ఎవరు గెలిచారు? ఇంతీ ఆ సినిమాలేంటి అంటే.. అల్లు అర్జున్ 2003 లో గంగోత్రి సినిమతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా ఓమోస్తర్ హిట్ కొట్టింది. 

ఇక అదే టైమ్ లో అప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. రాఘవేంద్ర  సినిమాతో బాక్సాఫీస్  బరిలో దిగాడు. సురేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈసినిమా చాలా సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి.. ఎట్టలకేలకు గంగోత్రి రిలీజ్ అయిన రోజే రిలీజ్ అయ్యింది. అయితే ఈ ఇద్దరిలో ఎవరి సినిమా గెలిచిందో తెలుసా? 

Prabhas, Allu Arjun

గంగోత్రి, రాఘవేంద్ర ఈరెండు సినిమాలలో రాఘవేంద్ర డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా.. అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా అయనా సూపర్ హిట్ అయ్యింది. ఇలా బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు ఫ్రెండ్స్ పోటీ పడగా ఎవరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయారు. కాని మొదటి సినిమా అయినా అల్లు అర్జున్ సినిమనే కాస్త సక్సెస్ సాధించింది అని చెప్పాలి. 

Latest Videos

click me!