The Raja Saab: రాజమౌళి వల్లే `ది రాజా సాబ్‌` మూవీ ఫ్లాప్‌, క్రేజీ రీజన్.. ఆ సెంటిమెంట్‌ ఇలా పనిచేసిందా?

Published : Jan 22, 2026, 07:58 AM IST

ప్రభాస్‌ నటించిన `ది రాజా సాబ్‌` మూవీ పరాజయం దిశగా వెళ్తోంది. అయితే ఈసినిమా ఫ్లాప్‌ కావడానికి కారణం మాత్రం రాజమౌళినే అంట. దీనికి ట్రోలర్స్ చెప్పిన కారణం తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. 

PREV
15
బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసిన ప్రభాస్‌ ది రాజా సాబ్‌

పాన్‌ ఇండియా స్టార్‌, మన డార్లింగ్‌ ప్రభాస్‌ రీసెంట్‌గా `ది రాజా సాబ్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పరాజయం దిశగా వెళ్తోంది.  బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. దాదాపు ఐదువందల కోట్ల కలెక్షన్లు రాబట్టాల్సిన ఈ మూవీ రెండు వందల కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు కలెక్షన్లు భారీగా తగ్గాయి. రోజుకు కోటి కూడా రాబట్టలేకపోతుంది. ఓవరాల్‌గా అయితే ఈ మూవీ డిజాస్టర్‌ దిశగా వెళ్తుందని చెప్పొచ్చు.

25
ది రాజాసాబ్‌ ఫ్లాప్‌ కి కారణం

ఇదిలా ఉంటే `ది రాజా సాబ్‌` మూవీ ఫ్లాప్‌ కి కారణం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఆడియెన్స్, అభిమానులు, మీడియా చెప్పే మాట ఏంటంటే ప్రభాస్‌ దెయ్యంని చూసి భయపడటం అనేదానికి ఆడియెన్స్‌ కనెక్ట్ కావడం లేదు. పైగా సినిమా స్లో ఉంది. సరైన ఎమోషన్స్ లేవు. సినిమా నేచురల్‌గా లేదు. కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాలేదు అంటున్నారు. ఫన్‌ వర్కౌట్‌ అయితే సినిమా ఆడేది. కానీ అది ఆశించిన స్థాయిలో లేదు. అందుకే ఆడియెన్స్ పెదవి విరిచారనేది అందరి నుంచి వినిపించే మాట.

35
రాజమౌళి వల్లే ది రాజా సాబ్‌ పరాజయం

కానీ `ది రాజా సాబ్‌` మూవీ పరాజయానికి మరో కారణం చెబుతున్నారు ట్రోలర్స్. దర్శకధీరుడు రాజమౌళినే కారణం అంటున్నారు. మరి ఈ సినిమాకి, జక్కన్నకి లింకేంటి అనేది చూస్తే, క్రేజీ కారణం చెబుతున్నారు. సాధారణంగా రాజమౌళితో ఏ హీరో అయినా సినిమా చేస్తే, ఆ మూవీ పెద్ద హిట్‌ అవుతుంది. కానీ ఆ తర్వాత ఆ హీరో చేసిన సినిమాలు పరాజయం చెందుతాయి. ఆ స్థాయి అంచనాలను అందుకోవడంలో విఫలమవుతాయని, అందుకే పరాజయం చెందుతాయని అంటుంటారు. ఇదొక సెంటిమెంట్‌గా చెబుతుంటారు. రాజమౌళి తో సినిమాలు చేసిన ప్రతి హీరోకి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.

45
కొంప ముంచిన రాజమౌళి సెంటిమెంట్‌?

అదే కారణం `ది రాజా సాబ్‌`కి ముడిపెడుతున్నారు. మరి రాజమౌళితో ప్రభాస్‌ ఇప్పుడు సినిమా ఏం చేయలేదు. మరి ఈ సెంటిమెంట్‌ ఎలా పని చేసిందనేది అందరికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు. దానికి ట్రోలర్స్ చెప్పిన కారణం మాత్రం క్రేజీగా ఉంది. `ది రాజా సాబ్‌` మూవీ విడుదలకు ముందు రాజమౌళి, ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన `బాహుబలి ది ఎపిక్‌` రిలీజ్‌ అయ్యింది. రెండు బాహుబలి సినిమాలను ఒక్కటి చేసి `బాహుబలి ది ఎపిక్‌` గా రిలీజ్‌ చేశారు. అక్టోబర్‌లోనే ఈ మూవీ విడుదలయ్యింది. దానికి మంచి స్పందన లభించింది. యాభై కోట్లకుపైగా కలెక్షన్లు కూడా వచ్చాయి. దీంతో `బాహుబలి ది ఎపిక్‌` తర్వాత `ది రాజా సాబ్‌` మూవీ విడుదలయ్యింది. రాజమౌళి సెంటిమెంట్‌ పనిచేసింది. దాని వల్లే ప్రభాస్‌ మూవీ పరాజయం చెందింది అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఇది చూసి అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ దానికి మించిన క్రేజీ కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు.

55
ది రాజా సాబ్‌ తెచ్చే నష్టాలు ఎంతంటే?

ఏదేమైనా `ది రాజా సాబ్‌` భారీ డిజాస్టర్‌గా నిలవబోతుంది. ఇది రూ.80-90కోట్ల వరకు నష్టాలను తీసుకురాబోతుందట. ఇక మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో సంజయ్‌ దత్ ముఖ్య పాత్ర పోషించారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories