Dhurandhar OTT: రణవీర్ సింగ్ రికార్డులు బద్దలు కొట్టిన స్పై యాక్షన్ సినిమా 'ధురంధర్' థియేటర్లలో అద్భుత విజయం తర్వాత డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌తో భారీ ఒప్పందం కుదరడంతో, ప్రేక్షకులు త్వరలో ఈ బ్లాక్‌బస్టర్‌ను ఇంట్లోనే చూడొచ్చు.
ఏడు వారాలకు పైగా థియేటర్లలో ఆధిపత్యం చెలాయించిన 'ధురంధర్' డిజిటల్ రంగ ప్రవేశానికి సిద్ధమైంది. రణవీర్ సింగ్ నటించిన ఈ స్పై థ్రిల్లర్ జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బాహుబలి రేంజ్ లో వసూళ్లు సాధించింది.
23
ధురంధర్ ఫ్రాంచైజీకి నెట్‌ఫ్లిక్స్ డీల్
ధురంధర్ డిజిటల్ ప్రయాణంలో అతిపెద్ద విశేషం దాని భారీ స్ట్రీమింగ్ ఒప్పందం. నెట్‌ఫ్లిక్స్ 'ధురంధర్', దాని సీక్వెల్ 'ధురంధర్ 2' OTT హక్కులను రూ.130 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం.
33
బాక్సాఫీస్ విజయం, ధురంధర్ 2లో తర్వాతి విశేషాలు
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఈ సినిమా భారతదేశంలో రూ. 826 కోట్లకు పైగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1283 కోట్లు వసూలు చేసింది.