బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ వీరే... హౌస్ లో రచ్చ రచ్చేనా? ఆడియన్స్ సిద్ధంగా ఉండండి!

Published : Jun 10, 2024, 06:24 PM ISTUpdated : Jun 10, 2024, 06:54 PM IST

బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. కాగా నెక్స్ట్ సీజన్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ లిస్ట్ బయటకు వచ్చింది. ఆ సెలబ్రిటీల పేర్లు చూస్తే రచ్చ ఖాయం అనిపిస్తుంది.   

PREV
15
బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ వీరే... హౌస్ లో రచ్చ రచ్చేనా? ఆడియన్స్ సిద్ధంగా ఉండండి!
Bigg boss telugu 8

బిగ్ బాస్ సీజన్ 7 అంచనాలకు మించిన విజయం అందుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇక టైటిల్ విన్నర్ ఒక సామాన్యుడు కావడం మరొక సంచలనం. రైతుబిడ్డగా హౌస్లో అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి బిగ్ బాస్ 7 టైటిల్ సొంతం చేసుకున్నాడు. 
 

25


అంబటి అర్జున్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, శివాజీ,  అమర్ దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్ ఫైనల్ కి వెళ్లారు. శివాజీ టైటిల్ విన్నర్ ని మొదటి నుండి ప్రచారం జరిగింది. అనూహ్యంగా పల్లవి ప్రశాంత్ రేసులో దోచుకొచ్చాడు. శివాజీ మూడో స్థానంలో నిలవగా, అమర్ దీప్ రన్నర్ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

35
Bigg Boss Telugu 8

కాగా సెప్టెంబర్ నెలలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుందట. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందట. గ్లామరస్, కాంట్రవర్సియల్, ఎంటర్టైనింగ్ పెర్సనాలిటీస్ ని బిగ్ బాస్ హౌస్లోకి పంపుతున్నారని సమాచారం అందుతుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది వీళ్ళే అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 

45
Bigg boss Telugu


యూట్యూబర్ బంచిక్ బబ్లు, హీరో రాజ్ తరుణ్, వినాయకుడు ఫేమ్ సోనియా సింగ్, నటి హేమ, రీతూ చౌదరి, సురేఖావాణి లేదా ఆమె కూతురు సుప్రీత, కిరాక్ ఆర్పీ, కుమారీ ఆంటీ, బర్రెలక్క, కుషిత కొల్లపు, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్... ఖచ్చితంగా హౌస్ ఉంటారని సమాచారం. 

55
Rithu Chowdary


నిజంగా వీరే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ అయితే ఆడియన్స్ కి పండగే పండగ. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ సొంతం అవుతుంది. అలాగే హోస్ట్ గా మరోసారి నాగార్జున రంగంలోకి దిగనున్నారట. ఆయనే బెస్ట్ ఛాయిస్ అని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. 
 

click me!

Recommended Stories