సైఫ్ అలీ ఖాన్ ఉండేది హై సెక్యూరిటీ కలిగిన ఏరియా, పైగా 10వ ఫ్లోర్ లో ఉంటున్నారు. దొంగ తనం చేసేందుకు వెళ్లిన వ్యక్తి అంత దూరం సెక్యూరిటీని తప్పించుకుని వెళ్లడం సాధ్యం అవుతుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కత్తిపోట్లతో రక్తమోడుతున్న తండ్రిని సైఫ్ పెద్ద కొడుకు ( మొదటి భార్య అమృత సింగ్ సంతానం) ఇబ్రహీం అలీ ఖాన్ ఆటోలో ఆసుపత్రికి తరలించాడట. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. 3.30 గంటలకు ఇబ్రహీం తండ్రిని ఆటోలో ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడట. ఆ సమయంలో డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో తీసుకుని వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.