కరీనా లీలావతి ఆసుపత్రిలో
తెల్లవారుజామున 2 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఆయనను లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. భర్త సైఫ్‌ను చూసేందుకు కరీనా ఆసుపత్రికి వెళ్లారు.
కరీనా లీలావతి ఆసుపత్రిలో
కరీనా కపూర్ గురువారం లీలావతి ఆసుపత్రిలో తన భర్త సైఫ్ అలీ ఖాన్‌ను సందర్శించారు. ఆమె మెరూన్ షర్ట్, జీన్స్ ధరించి ఉన్నారు.
కరీనా ఆసుపత్రి నుంచి బయలుదేరుతున్న దృశ్యం
భర్త సైఫ్ అలీ ఖాన్‌ను చూసిన తర్వాత కరీనా కపూర్ ఆసుపత్రి నుంచి బయలుదేరుతున్న దృశ్యం. సైఫ్ కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంటారు.
సారా, ఇబ్రహీం ఆసుపత్రిలో
తండ్రి సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరగడంతో సారా, ఇబ్రహీం ఆందోళన చెందారు. ఇద్దరూ తండ్రిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు.
కరిష్మా ఆసుపత్రి బయట
సైఫ్ అలీ ఖాన్‌ను చూసేందుకు కరిష్మా కపూర్ కూడా ఆసుపత్రికి వెళ్లారు. ఆమెను ఆసుపత్రి బయట చూశారు.కరీనా కపూర్ కి కరిష్మా సోదరి అనే సంగతి తెలిసిందే.
ఆసుపత్రిలో సోహా
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీ ఖాన్ కూడా తన సోదరుడిని చూసేందుకు లీలావతి ఆసుపత్రికి వెళ్లారు.