కంగనా రనౌత్ లైఫ్ సీక్రేట్ నుబయటపెట్టిన ప్రభాస్, అంత పెద్ద రహస్యం చెప్పిందా..?

Published : Jan 17, 2025, 05:36 PM IST

కొన్ని రహస్యాలు కొంతమందితోనే పంచుకుంటాము.  సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా. అలానే ప్రభాస్ తో తన రహస్యాన్ని పంచుకున్నారట కంగనా రనౌత్. ప్రభాస్ చెప్పిన ఆ రహస్యం ఏంటో తెలుసా..?     

PREV
15
కంగనా రనౌత్ లైఫ్ సీక్రేట్ నుబయటపెట్టిన ప్రభాస్,  అంత పెద్ద రహస్యం చెప్పిందా..?

ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు స్టార్లు గా మారుతారో తెలియదు. కొంత మంది లైఫ్ బాగుండి స్టార్స్ గా మారితే.. మరికొంత మంది మాత్రం  ఊహించని విధంగా స్టార్స్ అయ్యారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కంగనా రనౌత్ బాలీవుడ్ లో మెరిసి అందరి మనసులు గెలుచుకుంది. ఇప్పుడు బీజేపీ ఎంపీగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమె జీవితం ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో నిండి ఉంది. ఇందులో కొన్ని విషయాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.

 

25

కంగనా రనౌత్ తన కెరీర్, జీవితంలో జరిగిన ఎన్నో సంగతులను బహిరంగంగా చెప్పుకుంది. అయితే కొన్ని రహస్యాలను మాత్రం సన్నిహితులతో మాత్రమే పంచుకుంది. ప్రభాస్ తో 'ఏక్ నిరంజన్' సినిమా చేస్తున్న సమయంలో ఓ జీవిత రహస్యాన్ని ప్రభాస్ కు చెప్పింది కంగనా. అదే ఇప్పుడు బయటపడింది.

 

35

'ఏక్ నిరంజన్' సినిమాతో కంగనా తెలుగులోకి అడుగుపెట్టింది. షూటింగ్ సమయంలో తన జీవితంలోని చాలా విషయాలను ప్రభాస్ తో పంచుకుంది. చిన్న ఊళ్లో పుట్టి, సినిమాల్లో ఎలాంటి పరిచయాలు లేకుండా ఎలా ఎదిగిందో చెప్పింది. అలాగే జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను వివరించింది.

 

45

స్నేహితులతో కలిసి కేరళకు వెళ్లినప్పుడు ఓ జ్యోతిష్కుడు కంగనా నటిగా ఎదుగుతుందని చెప్పాడట. అప్పుడు సినిమా రంగం గురించి ఏమీ తెలియని ఆమె ఆ తర్వాత బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జ్యోతిష్కుడి మాట నిజమైంది. ఈ విషయాన్ని ప్రభాస్ వెల్లడించారు.

 

55

'రాధే శ్యామ్' ప్రమోషన్స్ సమయంలో ప్రభాస్ కంగనా రనౌత్ గురించి చెప్పారు. ఆమె కెరీర్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, సవాళ్ల గురించి మాట్లాడారు. తన జీవితంలో 'బాహుబలి' సినిమా చేయడం ఓ అద్భుతం అని కూడా అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories