
సంక్రాంతి సినిమాలు ఎఫెక్ట్ తో కొంతవరకూ పుష్ప 2 ఊపు తగ్గిన మాట నిజం. అయితే పుష్ప టీమ్ మాత్రం తగ్గేదేలే ..మనని చూడటానికి జనాలు థియేటర్ కు రావెలి అని ఫిక్సైంది. అందుకోసం సినిమాలో కొన్ని ఎగస్ట్రా సీన్స్ కలిపి, ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్‌ను (Pushpa 2 Reloaded Version) వదిలింది. ఈ ఎక్సటెండెడ్ వెర్షన్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఓటిటిలో చూడాల్సి ఉంటుందేమో అనుకుంటే థియేటర్స్ లోనే వదిలి ఫ్యాన్స్ కు పండగ చేసారు. ఇంతకీ ఈ ఎక్సటెండెడ్ వెర్షన్ లో వదిలిన సీన్స్ ఎలా ఉన్నాయి. మళ్లీ చూడాలనుకునేవాళ్లకు ఇవి కొత్త ఎంటర్టైన్మెంట్ ని అందిస్తాయా వంటి విషయాలు చూద్దాం.
ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ‘పుష్ప 2’చిత్రానికి అదనంగా 20 నిమిషాల నిడివి గల సన్నివేశాలను జోడించారు. ప్రస్తుతం ‘పుష్ప 2’ నిడివి 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు ఉండగా.. దానికి ఇంకా 20 నిమిషాల సీన్స్ యాడ్ చేస్తే, 3 గంటల 40 నిమిషాలు దాటిపోయింది. అంటే ఇంటర్వెల్‌తో కలిపి దాదాపు 4 గంటల పాటు ‘పుష్ప’ ప్రపంచంలో ప్రేక్షకుడు ఉంటాడు. అయినా సరే గిట్టుబాటు అయ్యే విధంగానే సీన్స్ ఉన్నాయి.
పుష్ప చిన్నప్పటి ధైర్యం
జపాన్ స్మగ్లర్స్ తో పుష్ప ఫైట్ తర్వాత , అతను ఓ సముద్రంలో పడతాడు. అది ప్లాష్ బ్యాక్ కు లీడ్ చేస్తుంది. చిన్నప్పటి పుష్ప రోజుల్లోకి వెళ్తుంది. క్రికెట్ బాల్ ని అక్కడున్న నీళ్లలోంచి తీసుకురావటం, అతను గెలిస్తే అతను మొల్లేటి వెంకట్ రమణ కు కొడుకు అని పిలుస్తామని అంటారు. దాంతో పుష్పకు ఈతరాకపోయినప్పటికీ నీళ్లలోకి దూకుతాడు. అతను చిన్నప్పటి నుంచి అతని ధైర్యం ఏమిటనేది చూపిస్తారు.
షెకావత్ డార్క్ స్కీమ్
ఇంటర్వెల్ సీన్ పుష్పకు మంగళం శ్రీను ప్లాష్ బ్యాక్ సీన్ ఒకటి వస్తుంది. మంగళం శ్రీను మూట ముళ్లు సర్దుకుని వెళ్లిపోదాం అంటాడు. ఆ తర్వాత షెకావత్..శ్రీను ని ఓ టన్ను రెడ్ శాండిల్ కావాలని కోరతాడు. అదే మెయిన్ ప్లాట్ కు దారి తీసే సీన్.
షెకావత్... గ్లోబుల్ స్మగ్లింగ్ నెట్ ని పట్టుకోవటం
షెకావత్..అరేబియన్ కంటైనర్ ని సముద్రంలో పట్టుకుని, శ్రీలంకు వెళ్లే కొన్ని పడవలను ఇన్విస్టిగేషన్ చేస్తాడు. అక్కడే అతనికి జక్కా రెడ్డికు హమీద్ కు మధ్య స్మగ్లింగ్ ఆపరేషన్ జరుగుతోందని రివీల్ అవుతుంది. పోర్ట్ దగ్గర కారు ఏక్సిడెంట్...హమీద్ ని షెకావత్ చంపటం, జపాన్ స్మగ్లింగ్ కు చెందిన లింక్ మొత్తం బయిటకు రావటం జరుగుతుంది. జక్కా రెడ్డి ఆ యాక్సిడెంట్ లో చనిపోతాడు.
ఇక సిండికేట్ లో ఆధిపత్య పోరు, పుష్ప జపాన్ కు వెళ్లి మిస్సయిన షిప్‌మెంట్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం వంటివి చూపెడతాడు. అలాగే జక్కా రెడ్డి చనిపోయిన తర్వాత జాల్ రెడ్డి దగ్గరికి వెళ్లి తనతో చేతులు కలవాలని పుష్ప అడగడం, కావేరి పెళ్లి సమయంలో తన అన్న నుంచి తన చిన్ననాటి లాకెట్ తిరిగి పొందడం లాంటి సీన్లు ఈ రీలోడెడ్ వెర్షన్ లో చేర్చారు.
‘పుష్ప 2’ రీలోడెడ్ కట్ లో ఉన్న సీన్స్ వల్ల జపాన్ లో జరిగే హీరో ఇంట్రడక్షన్ సీన్ కు ఓ క్లారిటీ వచ్చింది. అసలు జపాను. అక్కడ అల్లు అర్జున్ చేసిన తుఫాన్ ఏమిటి , అక్కడ వాళ్లకు పుష్పతో సమస్య ఏమిటి వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించాయి. వాటికోసం మూడో పార్ట్ వరకూ వేచి చూడాల్సిన పనిలేదు. చాలా ఎక్సైటింగ్ లింక్ ని ఈ ఫస్ట్ ఫైట్ సీన్ లో ఎస్టాబ్లిష్ చేసారు.
అలాగే సినిమా హైలెట్స్ ఒకటైన పుష్పను పట్టుకునేందుకు షెకావత్ చేసే రామేశ్వరం సెర్చ్ సీన్స్ ఎక్సటెంట్ చేసారు. అవి చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. ఆ సీన్స్ ఇంకా ఉన్నా చూడవచ్చు అన్నంత బాగా చిత్రీకరించారు సుకుమార్. సుకుమార్ డిటేలింగ్ ఎంత బాగా చేస్తారో ఈ సీన్స్ వల్ల మరో సారి సాధారణ ప్రేక్షకుడుకి కూడా క్లారిటీ వచ్చింది.
ఈ సినిమా ఎగస్ట్రా సిండికేట్ మీటింగ్ సీన్, జపనీస్ తో పుష్ప మీటింగ్ సీన్ , జాలి రెడ్డి సీన్స్ కూడా కనిపించి అలరిస్తాయి. చాలా సినిమాల్లో ఎగస్ట్రా సీన్స్ యాడ్ చేసామంటే చేసామన్నట్లు ఉంటాయి. పుష్ప 2 లో వచ్చినవి మాత్రం కీ సీన్స్ కావటం విశేషం.
ఈ ఇరవై నిముషాలు ఎడిటింగ్ చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఎక్కువ సెకండాఫ్ లోనే ఈ కట్ చేసిన సీన్స్ ఉండటం చెప్పుకోదగ్గ విషయం. దాదాపు ఫస్టాఫ్ లో పెద్దగా మార్పు అనిపించలేదు. ప్రారంభంలో అల్లు అర్జున్ సీన్ ఇంట్రడక్షన్ తప్పిస్తే. కొన్ని కొత్త డైలాగులు సైతం సినిమాకు ప్లస్ అయ్యాయి.
ఈ చిత్రం ఇప్పటికే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో రెండో స్థానంలో, తెలుగు సినిమాల లిస్ట్‌లో ప్రథమ స్థానంలోకి వచ్చింది. ‘దంగల్’ (రూ. 2 వేల కోట్లకుపైగా) తర్వాత ఇప్పటి వరకూ రెండో ప్లేస్‌లో ఉన్న ‘బాహుబలి 2’ (రూ.1810 కోట్లు)ను రికార్డును బ్రేక్ చేసింది. 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్) రాబట్టింది.