స్కూల్‌ మొత్తం అమ్మాయిలే, దీంతో అలా జరిగింది.. ఫస్ట్ క్రష్‌ బయటపెట్టిన ప్రభాస్‌

Published : Oct 22, 2025, 11:01 AM IST

డార్లింగ్‌ ప్రభాస్‌ని ఎంతో మంది అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. కానీ ప్రభాస్‌ ఇష్టపడే అమ్మాయి ఎవరు? ఆయన ఫస్ట్ క్రష్‌ ఎవరో తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే అది ఎల్‌కేజీ మ్యాటర్‌. 

PREV
15
అమ్మాయిలు ఆరాధించే అందగాడు ప్రభాస్‌

ప్రభాస్‌ పాన్‌ ఇండియా హీరో మాత్రమే కాదు, అమ్మాయిల మనసుదోచిన హీరో కూడా. ఆయనకోసం పడిచచ్చే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. కాలేజీలో ప్రభాస్‌.. ప్రభాస్‌ అని ఆరాధిస్తున్న వాళ్లు ఇప్పటికీ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్‌ ఎప్పటికీ పెళ్లి చేసుకోవద్దని కోరుకునే అమ్మాయిలు కూడా ఉండటం విశేషం. అందుకే ఆ మధ్య `కల్కి 2898ఏడీ` ఈవెంట్‌లో మీ(అమ్మాయిల) కోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదని డార్టింగ్‌ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చారు. ఆ సమయంలో ప్రభాస్‌ చెప్పిన ఆ మాటకి అమ్మాయిల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది.

25
అనుష్కతో పెళ్లి రూమర్

ప్రభాస్‌ని ఇంత మంది అమ్మాయిలు ఆరాధిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మరి డార్లింగ్‌కి ఇష్టమైన అమ్మాయి ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్‌ హీరో అయ్యాక అనుష్కతో చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో నాలుగు సినిమాలు కూడా వచ్చాయి. బెస్ట్ పెయిర్‌ అనిపించుకున్నారు. `బాహుబలి` తర్వాత నుంచి ఈ ఇద్దరి మధ్య వార్తలు బాగా వ్యాపించాయి. పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్‌ వినిపిస్తూనే ఉంది. మరి ఈ రూమర్స్ కి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

35
ప్రభాస్‌ ఫస్ట్ క్రష్‌.. ఏకంగా ఎల్‌కేజీలో

ఈ విషయం పక్కన పెడితే ప్రభాస్‌ లైఫ్‌లో ఒక క్రష్‌ ఉంది. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఎల్‌కేజీలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట. ఆమె అంటే ఎంతో ఇష్టమని, ఆమెని చూస్తూ ఉండాలనిపించేదని తెలిపారు ప్రభాస్‌. ఆమె ఎవరో కాదు, వాళ్ల స్కూల్‌ టీచర్‌. ఆ టీచర్‌ పేరు చెప్పలేదు, ఆమె అంటే ఒకలాంటి ఇష్టం ఉండేదని తెలిపారు ప్రభాస్‌. `మిర్చి` సినిమా సమయంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు. `ఎల్‌కేజీ చదువుకున్నప్పుడు మా టీచర్‌ అంటే బాగా ఇష్టం. ఆ వయసులో ఏర్పడే ఇష్టాన్ని క్రష్‌ అంటారేమో. టీచర్‌ అంటే ఎవరికైనా గౌరవం, మర్యాదతో కూడిన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను వేరే విధంగా చెప్పలేం` అని తెలిపారు ప్రభాస్‌. ఏదేమైనా ఎల్‌కేజీలోనే ప్రభాస్‌ ఒక అమ్మాయిపై ఇష్టం పెంచుకున్నాడంటే గురుడు మామూలోడు కాదని చెప్పొచ్చు.

45
స్కూల్‌లో అమ్మాయిలంతా ప్రభాస్‌ని చూసేవారట

ఈ ఇంటర్వ్యూలో స్కూల్‌ టైమ్‌లో అమ్మాయిలు తన వెంటపడటం గురించి చెబుతూ, 9వ తరగతిలో కో ఎడ్యూకేషన్‌లో చేరారట ప్రభాస్. బేసిక్‌గా అది గర్ట్స్ స్కూల్‌. ఆ ఏడాది కో ఎడ్యూకేషన్‌ స్టార్ట్ చేశారు. దీంతో అబ్బాయిలు కొంత మందే ఉన్నారు, అమ్మాయిల డామినేషన్‌ ఎక్కువగా ఉండేదని, ఉన్న అబ్బాయిల్లో తాను హైట్‌ ఎక్కువగా ఉండేవాడిని అని, దీంతో అమ్మాయిలు ఎక్కువగా తనవైపు చూసేవారట. అలా చాలా మంది అమ్మాయిలు తనవైపు చూసేవారని, అంతేకాని అప్పట్లో ఈ క్రష్‌లు, ప్రేమలు, స్నేహాలు లేవని తెలిపారు ప్రభాస్‌. బర్త్ డే సందర్భంగా ఈ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌గా మారింది.

55
ప్రభాస్‌ బర్త్ డే ట్రీట్స్

డార్లింగ్‌ రేపు గురువారం (అక్టోబర్‌ 23న) తన 45వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభాస్‌ నటించిన సినిమాల అప్‌ డేట్లు రాబోతున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `ఫౌజి` నుంచి ఇప్పటి వరకు ఎలాంటి లుక్‌ గానీ, పోస్టర్‌గానీ రాలేదు. ఈ బర్త్ డే సందర్భంగా ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతోపాటు `స్పిరిట్‌` అప్‌ డేట్‌ వస్తుందని టాక్‌. అలాగే `ది రాజాసాబ్‌` నుంచి ట్రీట్‌ ఏదైనా ఉంటుందా అనేది చూడాలి. మరోవైపు డార్లింగ్‌ బర్త్ డేని పురస్కరించుకుని `ఈశ్వర్‌`, `సలార్‌`, `పౌర్ణమి` చిత్రాలు రీ రిలీజ్‌ అవుతున్నాయి. ఈ నెల 31న `బాహుబలి` రెండు పార్ట్ లు కలిపి `బాహుబలిః ది ఎపిక్‌`గా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories