ప్రభాస్‌కి సెట్‌లో ఉన్న బ్యాడ్‌ హ్యాబిట్‌ ఏంటో తెలుసా?.. పాపం దర్శకులకు చుక్కలు.. రాజమౌళిపై కంప్లెయింట్‌..

Published : Jul 27, 2024, 05:02 PM IST

ప్రభాస్‌ ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ఆయనకు ఇమేజ్‌ పరంగా తిరుగులేదు. కానీ షూటింగ్‌ సెట్లో మాత్రం పెద్ద బ్యాడ్‌ క్వాలిటీ ఉంది. దర్శకులకు చుక్కలు చూపిస్తున్నాడట.   

PREV
16
ప్రభాస్‌కి సెట్‌లో ఉన్న బ్యాడ్‌ హ్యాబిట్‌ ఏంటో తెలుసా?.. పాపం దర్శకులకు చుక్కలు.. రాజమౌళిపై కంప్లెయింట్‌..

ప్రభాస్‌ని ఫ్యాన్స్ అంతా రెబల్‌ స్టార్‌గా పిలుస్తారు. పాన్‌ ఇండియా స్టార్ అన్నారు. కానీ ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయారు. ఆయన నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా మన ఇండియాతోపాటు ఇతర దేశాల్లోనూ మంచి ఆదరణ పొందింది. భారీ కలెక్షన్లని రాబట్టింది. ఇతర దేశాల ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. దీంతో ప్రభాస్ ఇతర స్టేట్స్ ఆడియెన్స్ కి కూడా దగ్గరవుతున్నాడు. ఇలా ఆయన గ్లోబల్‌ స్టార్‌గా మారిపోతున్నాడు. అయితే ఆయన సినిమాలు ఏ రేంజ్‌కి వెళ్లినా, ఎంతటి కలెక్షన్లు సాధించినా, మన తెలుగు ఆడియెన్స్ కి మాత్రం ఎప్పటికీ డార్లింగే. ఆయన సైతం ఫ్యాన్స్, సెలబ్రిటీ అనే తేడా లేకుండా అందరిని డార్లింగ్స్ గానే భావిస్తాడు. అందుకే ఆయన అందరికి డార్లింగే. 
 

26

ప్రభాస్‌ ఏడాదికి రెండు సినిమాలతో అలరిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో `సలార్‌`తో అదరగొట్టిన ప్రభాస్‌, ఇటీవల `కల్కి2898ఏడీ`తో వచ్చాడు. బాక్సాఫీసుని షేక్‌ చేశాడు. ఇలా ఆరు నెలల గ్యాప్‌లోనే రెండు సినిమాలతో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేశారు. తాను మాట్లాడేందుకు ఇష్టపడను, సినిమాలు చేస్తాను, ఏడాదికి రెండు సినిమాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా అని పలు సందర్భాల్లో ప్రభాస్‌ చెప్పాడు. అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. 
 

36

ప్రభాస్‌ తెలుగులోనే కాదు, ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక్కో సినిమాకి 150 కోట్లకుపైగానే పారితోషికం తీసుకుంటారు. ఇంత పెద్ద స్టార్‌ అయినా ఆయనలో కొన్ని వీక్‌నెస్‌లున్నాయి. అందులో ప్రధానమైనది సిగ్గు, బిడియం, మొహమాటం. ప్రభాస్‌లో ఉన్న బ్యాడ్‌ క్వాలిటీ ఇదే. పబ్లిక్‌లో ఆయన షై ఫీలవుతుంటాడు. అంతగా ఓపెన్‌ కాలేదు. అంతేకాదు సెట్‌లోనూ అదే సమస్య. పెద్ద ఆర్టిస్టులు ఉంటే ఆయన మరింత బిగుసుకుపోతుంటాడట. 
 

46

ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ చెప్పాడు.  షూటింగ్‌ సెట్‌లో బాగా పబ్లిక్ ఉంటే ఆయన బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతుంటాడట. అందరిలో యాక్టింగ్‌ చేయడం కూడా చాలా టఫ్‌గా ఉంటుందని, ఫ్యాన్స్ తాకిడి ఉంటే అసలు షూటింగ్‌ చేసేందుకు ఇష్టపడడట. బిడియం ఫీలింగ్‌ వల్ల తాను సరిగా చేయలేనని తెలిపారు ప్రభాస్‌. ఈ సందర్బంగా `ఛత్రపతి` సినిమా టైమ్‌లో ఓ అనుభవాన్ని పంచుకున్నారు. 
 

56

`ఛత్రపతి` సినిమా ఇంటర్వెల్‌ షాట్‌ చేస్తున్నారట. చుట్టూ జనం అంతా ఉన్నారు. చలి, వర్షం ఇలా అన్నీ ఉన్నాయి. అంత మంది జనాన్ని చూసిన ప్రభాస్‌ వామ్మో డైలాగ్‌ గట్టిగా చెప్పలేను అన్నాడట రాజమౌళితో. పరిస్థితి అర్థం చేసుకున్న జక్కన్న సరే చేసేయ్‌ అన్నాడట. ఆ షాట్‌లో తాను లిప్‌ సింక్‌ మాత్రమే ఇచ్చాడట. సరిగ్గా గమనిస్తే ఇలానే ఉంటుందని చేసి చూపించాడు ప్రభాస్‌. అయితే చాలా మంది అది చూసి రిహార్సల్‌ అనుకున్నారట. కానీ షాట్‌ అయిపోయిందని చెప్పారు డార్లింగ్‌. 
 

66

ఇక అప్పట్నుంచి జనం ఉన్నారంటే సైలెంటే అని తెలిపారు ప్రభాస్. విశ్వనాథ్‌తో `మిస్టర్ పర్‌ఫెక్ట్` సినిమా చేశాను. అంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నారంటే సైలెంట్‌గా చెప్పేస్తా. అది చూసి విశ్వనాథ్‌ గారు పిలిచి ఇలా అయితే ఎలా, ఓపెన్‌గా గట్టిగా చెప్పాలి డైలాగులు, సిగ్గు పడితే ఎలా అన్నారట. అది విని సర్‌ సర్‌ అన్నాడట ప్రభాస్‌. అప్పట్నుంచి అందరు దర్శకులు ఇబ్బంది పడుతూనే ఉన్నారట. రాజమౌళి వల్లే ఇలా సైలెంట్‌గా చెబుతున్నాడని  అందరు దర్శకులు కలిసి రాజమౌళిని తిడుతుంటారట. బాలయ్య తో `అన్‌ స్టాపబుల్‌ విత్ ఎన్బీకే` షోలో ప్రభాస్‌ ఈ విషయాలను పంచుకున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories